Home /News /business /

IRCTC OFFERS MYSTICAL KASHMIR TOUR PACKAGE FROM HYDERABAD KNOW FULL DETAILS SS

IRCTC Kashmir Tour: ఫ్లైట్‌లో హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Kashmir Tour: ఫ్లైట్‌లో హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Kashmir Tour: ఫ్లైట్‌లో హైదరాబాద్ టు కాశ్మీర్... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Mystical Kashmir Tour package | హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లాలనుకునేవారికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ విశేషాలు తెలుసుకోండి.

  కాశ్మీర్ వెళ్లాలనుకుంటున్నారా? ఈ వేసవిలో భూలోక స్వర్గం కాశ్మీర్‌లో కొన్ని రోజులు గడపాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్ బోట్ గ్రూప్ టూర్' పేరుతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 1 వరకు నాలుగు సార్లు ఈ ప్రత్యేక టూర్‌ను ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ఏప్రిల్ 15న, మే 1న, మే 10న, జూన్ 1న టూర్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కాశ్మీర్‌కు ఫ్లైట్‌లో పర్యాటకుల్ని తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునే పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ లోయల్లోని అందాలను వీక్షించడంతో పాటు గుల్మార్గ్, పహల్గమ్, సోన్‌మార్గ్ ప్రాంతాల్లో విహరించొచ్చు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 20 వరకు జరిగే తులీప్ ఫెస్టివల్ సందర్శించొచ్చు. మొత్తం 5 రాత్రులు 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

  IRCTC Mystical Kashmir Tour Package: ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ వివరాలివే...


  Day 1: ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 5:25 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కాలి. ఉదయం 7:45 గంటలకు ఢిల్లీలో ఫ్లైట్ దిగుతారు. ఢిల్లీలో ఉదయం 9:55 గంటలకు ఫ్లైట్ ఎక్కితే 11:30 గంటలకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ దిగుతారు. ఆ తర్వాత ఐఆర్‌సీటీసీ సిబ్బంది పర్యాటకుల్ని హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత షాపింగ్‌కు వెళ్లొచ్చు. రాత్రికి హోటల్‌లో బస చేయాలి.

  IRCTC Mystical Kashmir Tour package, IRCTC Hyderabad Kashmir Tour package, IRCTC tours from hyderabad, IRCTC tourism, IRCTC kashmir packages, ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ టూర్స్, ఐఆర్‌సీటీసీ టూరిజం, ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ ప్యాకేజీ
  ప్రతీకాత్మక చిత్రం


  Day 2: రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శంకరాచార్య ఆలయం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మొఘల్ గార్డెన్స్, చెష్మాషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్, తులీప్ గార్డెన్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత దాల్ లేక్ ఒడ్డున ఉన్న హజ్రత్ బల్ క్షేత్రాన్ని సందర్శించాలి. సాయంత్రం దాల్ సరస్సులో షికారా రైడ్ ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఫ్లోటింగ్ గార్డెన్స్ చార్ చినార్ సందర్శించాలి. రాత్రికి హోటల్‌లోనే బస చేయాలి.

  Day 3: మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత గుల్‌మార్గ్ తీసుకెళ్తారు. ఖిలాన్ మార్గ్‌కు ట్రెక్కింగ్ ఉంటుంది. గోండోలా పాయింట్, సైట్ సీయింగ్ లాంటివి పర్యాటకులు సొంత ఖర్చులతో వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం శ్రీనగర్‌కు తిరిగి చేరుకుంటారు. రాత్రికి హోటల్‌లో బస చేయాలి.

  IRCTC Mystical Kashmir Tour package, IRCTC Hyderabad Kashmir Tour package, IRCTC tours from hyderabad, IRCTC tourism, IRCTC kashmir packages, ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ టూర్స్, ఐఆర్‌సీటీసీ టూరిజం, ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ ప్యాకేజీ
  ప్రతీకాత్మక చిత్రం


  Day 4: నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పహల్గామ్ బయల్దేరాలి. సాఫ్రన్ ఫీల్డ్స్, అవంతిపుర రుయిన్స్ సందర్శించాలి. పహల్గామ్ నుంచి మినీ స్విట్జర్లాండ్, ఇతర సైట్ సీయింగ్ ప్లేసెస్‌కి పర్యాటకులు తమ సొంత ఖర్చులతో వెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం శ్రీనగర్‌కు బయల్దేరాలి. రాత్రికి హోటల్‌లో బస చేయాలి.

  Day 5: ఐదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సోన్‌మార్గ్ ఫుల్ డే ట్రిప్ ఉంటుంది. తాజివాస్ గ్లేసియర్ సందర్శించొచ్చు. సోన్‌మార్గ్ నుంచి సైట్ సీయింగ్ వెళ్లే పర్యాటకులు సొంత ఖర్చులతో వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం శ్రీనగర్ చేరుకున్న తర్వాత హౌజ్‌బోట్‌లో చెకిన్ కావాలి. రాత్రికి హౌజ్ బోట్‌లో బస చేయాలి.

  Day 6: ఆరో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హౌజ్‌బోట్ నుంచి చెకౌట్ కావాలి. మధ్యాహ్నం 03:05 గంటలకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో బయల్దేరితే సాయంత్రం 04:35 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో రాత్రి 07:10 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 09:20 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

  IRCTC Mystical Kashmir Tour package, IRCTC Hyderabad Kashmir Tour package, IRCTC tours from hyderabad, IRCTC tourism, IRCTC kashmir packages, ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ టూర్స్, ఐఆర్‌సీటీసీ టూరిజం, ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ ప్యాకేజీ
  Source: IRCTC Tourism


  ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర ఏప్రిల్ 15న, మే 1న రూ.24300 కాగా, మే 10న, జూన్ 1న రూ.24870. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్, హౌజ్ బోట్ అకామడేషన్, బ్రేక్‌ఫాస్ట్ డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో https://www.irctctourism.com/ ఓపెన్ చేసి బుక్ చేసుకోవాలి. ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఇవి కూడా చదవండి:

  IRCTC Ramayana Express: ఐఆర్‌సీటీసీ రామాయణ ఎక్స్‌ప్రెస్ మార్చి 28న ప్రారంభం

  Indian Railways: రైలులో ఇచ్చే బ్లాంకెట్స్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసా?

  IRCTC Golden Chariot: గుడ్ న్యూస్... లగ్జరీ రైలు ప్యాకేజీ ధర తగ్గించిన ఐఆర్‌సీటీసీ
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Best tourist places, Business, BUSINESS NEWS, Irctc, Jammu and Kashmir, Jammu kashmir, Kashmir, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tourism

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు