IRCTC: విశాఖపట్నం నుంచి కేరళకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Majestic Kerala With Shree Padmanabhaswamy tour | ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో అకామడేషన్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, 5 బ్రేక్‌ఫాస్ట్, 5 డిన్నర్ కవర్ అవుతాయి.

news18-telugu
Updated: November 26, 2019, 1:27 PM IST
IRCTC: విశాఖపట్నం నుంచి కేరళకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
IRCTC: విశాఖపట్నం నుంచి కేరళకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
విశాఖపట్నం వాసులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC విశాఖపట్నం నుంచి కేరళకు టూర్ ప్యాకేజీ రూపొందించింది. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని బీచ్‌లు, బ్యాక్‌వాటర్ అందాలు, పశ్చిమ కనుమల్లో కనువిందు చేసే దృశ్యాలను చూస్తూ విహరించొచ్చు. దాంతో పాటు శ్రీ పద్మనాభస్వామిని దర్శించుకోవచ్చు. 2020 జనవరి 30న విశాఖపట్నం నుంచి టూర్ ప్రారంభమవుతుంది. మున్నార్, అలెప్పీ, కోవలం, త్రివేండ్రం లాంటి ప్రాంతాలను సందర్శించొచ్చు. 'మేజిస్టిక్ కేరళ విత్ శ్రీ పద్మనాభస్వామి' పేరుతో ఐఆర్‌సీటీసీ రూపొందించిన టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.25900. ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో అకామడేషన్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, 5 బ్రేక్‌ఫాస్ట్, 5 డిన్నర్ కవర్ అవుతాయి.

IRCTC Majestic Kerala Package: ఐఆర్‌సీటీసీ కేరళ ప్యాకేజీ వివరాలు


ఐఆర్‌సీటీసీ 'మేజిస్టిక్ కేరళ విత్ శ్రీ పద్మనాభస్వామి' టూర్ 2020 జనవరి 30న విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12:15 విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే చెన్నై విమానాశ్రయానికి మధ్యాహ్నం 01:40 గంటలకు చేరుకుంటారు. చెన్నై నుంచి సాయంత్రం 05:20 గంటలకు ఫ్లైట్‌ ఎక్కితే కొచ్చిన్‌కు సాయంత్రం 06:35 గంటలకు చేరుకుంటారు. రాత్రికి కొచ్చిన్‌లోనే బస చేయాలి. జనవరి 31న కొచ్చిన్, ఎర్నాకులం టూర్ ఉంటుంది. డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రూజ్ బసిలికా లాంటివి సందర్శించాలి. మధ్యాహ్నం తర్వాత మున్నార్ తీసుకెళ్తారు. సాయంత్రం మున్నార్‌లో విహరించొచ్చు. రాత్రికి మున్నార్‌లోనే బస చేయాలి. ఫిబ్రవరి 1న లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శన ఉంటుంది. మట్టుపెట్టి డ్యామ్, టీ మ్యూజియం సందర్శన తర్వాత మున్నార్ తిరిగి చేరుకోవాలి. రాత్రి మున్నార్‌లోనే బస చేయాలి.

ఫిబ్రవరి 2న మున్నార్ నుంచి అలెప్పీ బయల్దేరాలి. రాత్రికి అక్కడే బోటులో సొంత ఖర్చులతో బస చేయాలి. ఫిబ్రవరి 3న అలెప్పీ నుంచి త్రివేండ్రం బయల్దేరాలి. పద్మనాభస్వామి ఆలయం, కోవాలం బీచ్ సందర్శించాలి. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి. ఫిబ్రవరి 4న త్రివేండ్రం నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఉదయం 09:35 గంటలకు త్రివేండ్రం ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 11:15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:40 హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 01:50 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:IRCTC: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... ఫ్లైట్‌లో తిరుపతి వెళ్లండి ఇలా

IRCTC Rail Connect App: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే

IRCTC Araku Tour: అద్దాల రైలులో 'ఆంధ్రా ఊటీ' టూర్... ఐఆర్‌సీటీసీ అరకు ప్యాకేజీ వివరాలివే
First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>