IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కోణార్క్ టూర్ ప్యాకేజీ... వివరాలివే

IRCTC Odisha Tour | నవంబర్ 29న ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. 3 రాత్రులు, నాలుగు రోజుల టూర్ ఇది.

news18-telugu
Updated: August 15, 2019, 10:25 AM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కోణార్క్ టూర్ ప్యాకేజీ... వివరాలివే
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కోణార్క్ టూర్ ప్యాకేజీ... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 15, 2019, 10:25 AM IST
మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ కోణార్క్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 'మెగ్నిఫిషియంట్ ఒడిషా-కోణార్క్ డ్యాన్స్ అండ్ ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ స్పెషల్' పేరుతో ఈ ప్యాకేజీ రూపొందించింది. ఒడిషాలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలైన పూరీ, కోణార్క్, చిల్కా లేక్, భువనేశ్వర్ ప్రాంతాలకు తీసుకెళ్లనుంది. పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, కోణార్క్ బీచ్‌తో పాటు ఏడాదికోసారి జరిగే కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ చూడొచ్చు. నవంబర్ 29న ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. 3 రాత్రులు, నాలుగు రోజుల టూర్ ఇది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.19522. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, 3 రోజుల బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. ఐఆర్‌సీటీసీ ఒడిషా టూర్ ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IRCTC Odisha Tour: ఐఆర్‌సీటీసీ ఒడిషా టూర్ ప్యాకేజీ వివరాలివే


నవంబర్ 29న ఉదయం 7.55 గంటలకు హైదరాబాద్‌లో భువనేశ్వర్ ఫ్లైట్ ఎక్కాలి. ఉదయం 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత సైట్ సీయింగ్ ఉంటుంది. ట్రైబల్ మ్యూజియం, ఖందగరి ఉదైగిరి గుహల సందర్శన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత లింగరాజ్ ఆలయం, ధౌలిలోని బౌద్ధమఠం తీసుకెళ్తారు. ఆ తర్వాత పూరీకి బయల్దేరాలి. రాత్రి పూరీలో బస చేయాలి. నవంబర్ 30న చిల్కా లేక్ తీసుకెళ్తారు. బోటులో దీవికి తీసుకెళ్తారు. ఐరావడి డాల్ఫిన్ సైట్‌ చూసిన తర్వాత తిరికి పూరీకి తీసుకెళ్తారు. దారిలో అల్లర్‌నాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి పూరీలోనే బస చేయాలి. డిసెంబర్ 1న జగన్నాథ ఆలయ సందర్శన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత కోణార్క్ ఆలయానికి తీసుకెళ్తారు. చంద్రభాగ బీచ్‌లో కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం ఉంటుంది. రాత్రికి తిరిగి పూరీకి తీసుకొస్తారు. డిసెంబర్ 2 ఉదయం 06.30 గంటలకు పూరీ నుంచి బయల్దేరాలి. 08.00 గంటలకు భువనేశ్వర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఉదయం 10.00 గంటలకు భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కితే 11.35 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

IRCTC: హనీమూన్‌ ప్లాన్ చేసుకుంటున్నారా? ప్యారిస్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ
Loading...
IRCTC: హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్...

IRCTC: హైదరాబాద్ టు గోవా... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...