IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకునేవారికి గుడ్ న్యూస్... కేరళ హనీమూన్ ప్యాకేజీ రూ.8760 మాత్రమే

IRCTC Kerala Honeymoon Package | ఐఆర్‌సీటీసీ కేరళ హనీమూన్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.8760 మాత్రమే. ఇద్దరికి రూ.17,520 అవుతుంది. స్లీపర్, ఏసీ క్లాసులకు ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉన్నాయి.

news18-telugu
Updated: August 16, 2019, 3:01 PM IST
IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకునేవారికి గుడ్ న్యూస్... కేరళ హనీమూన్ ప్యాకేజీ రూ.8760 మాత్రమే
IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకునేవారికి గుడ్ న్యూస్... కేరళ హనీమూన్ ప్యాకేజీ రూ.8760 మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 16, 2019, 3:01 PM IST
కొత్త దంపతులకు హనీమూన్ అనగానే గుర్తొచ్చేది కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునే కేరళ... పర్యాటకులకు ఎప్పుడూ లిస్ట్‌లో టూరిస్ట్ స్పాటే. హనీమూన్‌కు ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్ కూడా. మరి మీరు హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ కేరళ హనీమూన్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఆగస్ట్ 27, సెప్టెంబర్ 3, 10, 17 తేదీల్లో హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారిని కొచ్చిన్, మున్నార్, అలెప్పీ ప్రాంతాలకు తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. ఐఆర్‌సీటీసీ కేరళ హనీమూన్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.8760 మాత్రమే. ఇద్దరికి రూ.17,520 అవుతుంది. స్లీపర్, ఏసీ క్లాసులకు ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. స్లీపర్ క్లాస్ లేదా 3AC కోచ్‌లో ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. బోటింగ్, ఇతర ఎంట్రీ ఫీజులు ప్యాకేజీలో కవర్ కావు. ప్యాకేజీ ధరల కోసం కింద చార్ట్ చూడండి. ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IRCTC Kerala Honeymoon Package, kerala honeymoon package, kerala honeymoon packages from hyderabad, cheapest honeymoon packages in kerala, IRCTC Honeymoon Packages, ఐఆర్‌సీటీసీ కేరళ హనీమూన్ ప్యాకేజీ, కేరళ హనీమూన్ ప్యాకేజీ, హైదరాబాద్ కేరళ హనీమూన్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ హనీమూన్ ప్యాకేజెస్, ఐఆర్‌సీటీసీ టూర్స్
Source: IRCTC

IRCTC Kerala Honeymoon Package: కేరళ హనీమూన్ ప్యాకేజీ వివరాలు



ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 11:40 శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రెండో రోజు మధ్యాహ్నం 01:15 గంటలకు ఎర్నాకులం చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత ఫోర్ట్ కొచ్చి సందర్శన, సాయంత్రం మెరైనా డ్రైవ్ ఉంటాయి. రాత్రికి కొచ్చిలో బస చేయాలి. మూడో రోజు ఉదయం మున్నార్‌కు బయల్దేరాలి. మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్ సందర్శన, సైట్ సీయింగ్ తర్వాత రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. నాలుగో రోజు ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శన తర్వాత కుమారకోమ్ బయల్దేరాలి. కుమారకోమ్ పక్షుల అభయారణ్యం సందర్శన ఉంటుంది. రాత్రికి అలెప్పీలో బస చేయాలి. ఐదో రోజు ఎర్నాకులం బయల్దేరాలి. ఉదయం 11:50 గంటలకు ఎర్నాకులంలో రైలు ఎక్కితే ఆరో రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.



Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:
Loading...
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కోణార్క్ టూర్ ప్యాకేజీ... వివరాలివే

IRCTC: ఎయిర్‌‌పోర్టును తలపించేలా ఐఆర్‌సీటీసీ ఎగ్జిక్యూటీవ్ లాంజ్... బుక్ చేసుకోండి ఇలా

IRCTC: హనీమూన్‌ ప్లాన్ చేసుకుంటున్నారా? ప్యారిస్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...