IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి మధ్యప్రదేశ్ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Hyderabad-Madhya Pradesh tour | 4 రాత్రులు / 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఒక రోజు భోపాల్‌లో, ఒక రోజు ఓంకారేశ్వర్‌లో, రెండు రోజులు ఉజ్జయినిలో బస చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: July 20, 2019, 1:21 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి మధ్యప్రదేశ్ టూర్... ప్యాకేజీ వివరాలివే
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి మధ్యప్రదేశ్ టూర్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 20, 2019, 1:21 PM IST
టూర్ వెళ్లాలనుకునేవారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు టూర్ ప్యాకేజీ రూపొందించింది ఐఆర్‌సీటీసీ. మధ్యప్రదేశ్‌లోని అడవులు, చారిత్రక, వారసత్వ, పురాతన కట్టడాలు, ఆధునిక నగరాలు, దేవాలయాలను సందర్శించొచ్చు. భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, సాంచి లాంటి ప్రాంతాలకు తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. 2019 సెప్టెంబర్ 14న టూర్ ప్రారంభమవుతుంది. 4 రాత్రులు / 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఒక రోజు భోపాల్‌లో, ఒక రోజు ఓంకారేశ్వర్‌లో, రెండు రోజులు ఉజ్జయినిలో బస చేయాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీ సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.23,670, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.21,000, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.20,370. ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఐఆర్‌సీటీసీ హైదరాబాద్-మధ్యప్రదేశ్ టూర్ షెడ్యూల్ ఇదే...


సెప్టెంబర్ 14న హైదరాబాద్-మధ్యప్రదేశ్ టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 7:10 గంటలకు హైదరాబాద్ నుంచి భోపాల్‌కు ఫ్లైట్‌లో తీసుకెళ్తారు. భోపాల్‌కు ఉదయం 09:35 గంటలకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. తర్వాత సాంచీ తీసుకెళ్తారు. సాంచీ స్తూపాన్ని సందర్శించిన తర్వాత తిరిగి భోపాల్ రావాలి. సాయంత్రం తాజ్ మసీద్, అప్పర్ లేక్ సందర్శన ఉంటుంది. రాత్రి భోపాల్‌లో బస చేయాలి. సెప్టెంబర్ 15న ఓంకారేశ్వర్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం ఓంకారేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత రాత్రి అక్కడే బస చేయాలి. సెప్టెంబర్ 16న ఓంకారేశ్వర్ నుంచి బయల్దేరి మహేశ్వర్, మండూ ప్రాంతాలను సందర్శించాలి. సాయంత్రానికి ఉజ్జయిని చేరుకుంటారు. రాత్రి ఉజ్జయినిలోనే బస చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17న ఉజ్జయినిలోని స్థానిక ఆలయాల సందర్శన ఉంటుంది. సెప్టెంబర్ 18న ఉదయం ఇండోర్‌కు బయల్దేరాలి. మధ్యాహ్నం 12:35 గంటలకు హైదరాబాద్‌ ఫ్లైట్ ఎక్కితే 13:55 గంటలకు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

IRCTC: వైజాగ్ నుంచి రాజస్తాన్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
Loading...
Aadhaar-PAN: ఆధార్, పాన్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉన్నాయా? ఇలా చేయండి

FASTags: హైవేపై వెళ్తున్నారా? ఇక 'ఫాస్ట్‌ట్యాగ్' తప్పనిసరి

 
First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...