Home /News /business /

IRCTC: తిరుమల వెళ్లాలా? ఐఆర్‌సీటీసీ నుంచి ప్రతీ రోజూ టూర్ ప్యాకేజీ

IRCTC: తిరుమల వెళ్లాలా? ఐఆర్‌సీటీసీ నుంచి ప్రతీ రోజూ టూర్ ప్యాకేజీ

IRCTC: తిరుమల వెళ్లాలా? ఐఆర్‌సీటీసీ నుంచి ప్రతీ రోజూ టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: తిరుమల వెళ్లాలా? ఐఆర్‌సీటీసీ నుంచి ప్రతీ రోజూ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Govindam Tour | ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునే టూరిస్టులు తిరుమలలో దర్శనం కోసం తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాలి. లేకపోతే తిరుమలలో దర్శనం సాధ్యం కాదు.

    తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ తిరుమల తిరుపతి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. 'గోవిందం' పేరుతో ఐఆర్‌సీటీసీ రూపొందించిన టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూర్‌లో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. స్లీపర్ లేదా థర్డ్ ఏసీ కోచ్‌లో తిరుపతి తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. తిరుమల, తిరుచానూర్ వెళ్లేందుకు ఏసీ వాహనం ఏర్పాటు చేస్తుంది. ప్యాకేజీలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, గైడ్ సర్వీస్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునే టూరిస్టులు తిరుమలలో దర్శనం కోసం తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాలి. లేకపోతే తిరుమలలో దర్శనం సాధ్యం కాదు. పురుషులు తెల్ల ధోతీ, షర్ట్, కుర్తా, పైజామాతో, స్త్రీలు చీర, సల్వార్ కమీజ్‌తో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలో వివరించింది. ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3910. స్లీపర్, థర్డ్ ఏసీలకు ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ప్యాకేజీ వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

    IRCTC tirumala tour package, IRCTC tirupati package from hyderabad, tirupati tour package from hyderabad, tirupati package by train, tirupati darshan package from hyderabad by train, irctc tirupati package, ఐఆర్‌సీటీసీ తిరుమల టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ తిరుపతి ప్యాకేజీ, తిరుపతి రైల్ టూర్ ప్యాకేజీ, హైదరాబాద్ తిరుపతి టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ టూర్స్, ఐఆర్‌సీటీసీ టూరిజం
    Source: IRCTC

    IRCTC Govindam Tour: ఐఆర్‌సీటీసీ తిరుమల టూర్ ప్యాకేజీ వివరాలివే


    ఐఆర్‌సీటీసీ తిరుమల టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో తిరుపతి రైల్ ఎక్కాలి. రెండో రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటారు. హోటల్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత తిరుమలకు తీసుకెళ్తారు. శీఘ్రదర్శనంలో శ్రీవారిని దర్శించుకోవాలి. దర్శనం తర్వాత తిరుపతి చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత సమయం ఉంటే తిరుచానూర్ ఆలయ సందర్శన ఉంటుంది. హోటల్ నుంచి చెక్ ఔట్ చేసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. సాయంత్రం 06:25 గంటలకు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే ఉదయం 06:25 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    IRCTC: ఎయిర్‌‌పోర్టును తలపించేలా ఐఆర్‌సీటీసీ ఎగ్జిక్యూటీవ్ లాంజ్... బుక్ చేసుకోండి ఇలా

    IRCTC: హనీమూన్‌ ప్లాన్ చేసుకుంటున్నారా? ప్యారిస్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ

    IRCTC: హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్...
    First published:

    Tags: Best tourist places, Indian Railway, Indian Railways, Irctc, Railways, South Central Railways, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati, Tourism

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు