IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి రాజస్తాన్ టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే

IRCTC Golden Sands of Rajasthan | ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి జైసల్మేర్, ఉదయ్‌పూర్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు, 1 రాత్రి జైసల్మేర్, 1 రాత్రి జైసల్మేర్ డిసర్ట్ క్యాంప్, 1 రాత్రి జోధ్‌పూర్, 2 రాత్రులు ఉదయ్‌పూర్‌లో బస, ఐదు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, 1 లంచ్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

news18-telugu
Updated: September 17, 2019, 4:16 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి రాజస్తాన్ టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి రాజస్తాన్ టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 17, 2019, 4:16 PM IST
టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ 'గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్తాన్' పేరుతో రాజస్తాన్ టూర్ ప్యాకేజీ రూపొందించింది. హైదరాబాద్ నుంచి నవంబర్ 12న ఈ టూర్ ప్రారంభమవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ఇది. ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.26,000. జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ ప్రాంతాలకు తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి జైసల్మేర్, ఉదయ్‌పూర్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు, 1 రాత్రి జైసల్మేర్, 1 రాత్రి జైసల్మేర్ డిసర్ట్ క్యాంప్, 1 రాత్రి జోధ్‌పూర్, 2 రాత్రులు ఉదయ్‌పూర్‌లో బస, ఐదు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, 1 లంచ్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com వెబ్‌సైట్‌లో ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ 'గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్తాన్' టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IRCTC Golden Sands of Rajasthan: టూర్ ప్యాకేజీ వివరాలివే...


ఐఆర్‌సీటీసీ 'గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్తాన్' టూర్ నవంబర్ 12న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఉదయం 05:05 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే అహ్మదాబాద్‌కు 07:05 గంటలకు చేరుకుంటారు. ఉదయం 10:40 గంటలకు అహ్మదాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:15 జైసల్మేర్ చేరుకుంటారు. మధ్యాహ్నం హోటల్‌కు చేరుకున్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని సైట్‌సీయింగ్‌కు బయల్దేరాలి. జైసల్మేర్ ఫోర్ట్, పట్వోన్ కీ హవేలీ, గడీసర్ లేక్ సందర్శన్ ఉంటుంది. షాపింగ్ తర్వాత రాత్రి జైసల్మేర్‌లో బస చేయాలి. నవంబర్ 13న జైసల్మేర్ ఫోర్ట్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత డిసర్ట్ క్యాంప్‌కు బయల్దేరాలి. సొంత ఖర్చులతో క్యామెల్, జీప్ రైడ్‌కు వెళ్లొచ్చు. సాయంత్రం ఎడారిలో సూర్యాస్తమయాన్ని చూసిన తర్వాత రాత్రికి డిసర్ట్ క్యాంప్‌లో బస చేయాలి.

నవంబర్ 14న జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు బయల్దేరాలి. మెహ్రాన్‌గఢ్ ఫోర్ట్, జస్వంత్ తాడా సందర్శన ఉంటుంది. రాత్రికి జోధ్‌పూర్‌లో బస చేయాలి. నవంబర్ 15న జోధ్‌పూర్ నుంచి చిత్తోర్‌గఢ్ మీదుగా ఉదయ్‌పూర్ వెళ్లాలి. దారిలో ఉమైద్ భవన్ ప్యాలెస్, చిత్తోర్‌గఢ్ ఫోర్ట్ సందర్శన ఉంటుంది. రాత్రికి ఉదయ్‌పూర్‌లో బస చేయాలి. నవంబర్ 16న ఉదయ్‌పూర్ లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి ఉదయ్‌పూర్‌లో బస చేయాలి. నవంబర్ 17న ఉదయ్‌పూర్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. సాయంత్రం 05:15 గంటలకు ఉదయ్‌పూర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 07:00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:
Loading...
Airtel Bharosa Account: రూ.500 మినిమమ్ బ్యాలెన్స్... ఉచితంగా రూ.5 లక్షల ప్రమాద బీమా

Xiaomi: స్మార్ట్‌టీవీ, వాటర్ ప్యూరిఫైర్... షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్

Best Smartphones: ఆన్‌లైన్‌ సేల్‌లో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...