IRCTC: హైదరాబాద్‌-గోవా టూర్... తక్కువ ధరకే ప్యాకేజీ

IRCTC Goa Tour Package | ఈ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి గోవా, గోవా నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఉంటాయి.

news18-telugu
Updated: July 25, 2019, 6:13 PM IST
IRCTC: హైదరాబాద్‌-గోవా టూర్... తక్కువ ధరకే ప్యాకేజీ
IRCTC: హైదరాబాద్‌-గోవా టూర్... తక్కువ ధరకే ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గోవా టూర్ వెళ్దామనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌ నుంచి గోవాకు టూర్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.12,625 మాత్రమే. 'గోవాన్ డిలైట్' పేరుతో ఐఆర్‌సీటీసీ రూపొందించిన ప్యాకేజీ ఇది. 2 రాత్రులు, 3 పగళ్ల గోవా టూర్ సెప్టెంబర్ 8న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తుంది ఐఆర్‌సీటీసీ. గోవాలోని ప్రముఖ బీచ్‌లు, టూరిస్ట్ స్పాట్స్‌ని కవర్ చేస్తుంది. వాటర్‌ఫాల్స్, బీచ్‌లల్లో విహారం, అడ్వెంచర్ యాక్టివిటీస్ లాంటివి ఉంటాయి. ఈ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి గోవా, గోవా నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఉంటాయి. లంచ్‌ కోసం మాత్రం సొంతగా ఖర్చు చేసుకోవాలి. త్రీ-స్టార్ హోటల్‌లో బస ఏర్పాటు చేస్తుంది ఐఆర్‌సీటీసీ.





సెప్టెంబర్ 8న ఉదయం 8:35 గంటలకు హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో గోవా ఫ్లైట్ ఎక్కాలి. 10:05 గంటలకు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి ప్యారడైజ్ విలేజ్ బీచ్ రిసార్ట్‌కు టూర్ మేనేజర్ తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత జువారీ రివర్, మోర్ముగోవా హార్బర్‌ చూపిస్తారు. లంచ్ తర్వాత రెయిస్ మోగోస్ ఫోర్ట్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం మండోవీ రివర్‌లో బోట్ క్రూజ్ ఎంజాయ్ చేసిన తర్వాత 7 గంటలకు హోటల్‌కు తీసుకెళ్తారు. డిన్నర్ తర్వాత హోటల్‌లో బస చేయాలి. సెప్టెంబర్ 9న నార్త్ గోవా టూర్ ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఫోర్ట్ అగ్వాడా, క్యాండోలిమ్ బీచ్, బాగా బీచ్‌లో విహారం, వాటస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. అంజునా బీచ్, వేగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్‌ సైట్‌సీయింగ్ ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్‌కు తీసుకెళ్తారు. సెప్టెంబర్ 10న సౌత్ గోవా టూర్ ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెకౌట్ చేయాలి. ఆ తర్వాత ఓల్డ్ గోవా చర్చ్, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం శ్రీ మంగేషీ టెంపుల్, మీరామర్ బీచ్, డోనా పౌలా వ్యూపాయింట్ చూపిస్తారు. రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్‌కు ఫ్లైట్ ఎక్కాలి. రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి
Loading...

ఇవి కూడా చదవండి:

IRCTC Tour: రూ.6,300 ధరకే హరిద్వార్, రిషికేష్ ప్యాకేజీ

IRCTC: వైజాగ్ నుంచి థాయ్‌ల్యాండ్ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి దుబాయ్ టూర్... ప్యాకేజీ వివరాలివే
First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...