IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కాశీ యాత్ర... ప్యాకేజీ వివరాలివే

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కాశీ యాత్ర... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Ganga Gaya Sangam Yatra | ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.20520. క్లాస్‌ని బట్టి ప్యాకేజీ ధర మారుతుంది. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, బోధ్ గయలో 1 రోజు, వారణాసిలో 3 రోజులు హోటల్‌లో అకామడేషన్, నాలుగు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

  • Share this:
    ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC కాశీ యాత్రకు తీసుకెళ్తోంది. 'గంగా గయ సంగం యాత్ర' పేరుతో వారణాసి ప్యాకేజీ రూపొందించింది. 4 రాత్రులు, 5 రోజుల ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే టూర్ ప్యాకేజీలో వారణాసితో పాటు పాట్నా, బోధ్ గయ, ప్రయాగ్‌రాజ్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. సెప్టెంబర్ 18, అక్టోబర్ 2న 'గంగా గయ సంగం యాత్ర' ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.20520. క్లాస్‌ని బట్టి ప్యాకేజీ ధర మారుతుంది. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, బోధ్ గయలో 1 రోజు, వారణాసిలో 3 రోజులు హోటల్‌లో అకామడేషన్, నాలుగు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ప్యాకేజీ ధరల వివరాల కోసం కింద చార్ట్ చూడండి. ఐఆర్‌సీటీసీ 'గంగా గయ సంగం యాత్ర' ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    irctc varanasi, IRCTC Ganga Gaya Sangam Yatra, irctc tour packages 2019, irctc varanasi package from hyderabad, kashi package from hyderabad, irctc tour packages 2019, irctc tour packages kasi 2019, irctc kashi package from hyderabad, irctc air packages, ఐఆర్‌సీటీసీ వారణాసి ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ వారణాసి టూర్, ఐఆర్‌సీటీసీ కాశీ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ కాశీ టూర్, ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ కాశీ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ టూర్స్, ఐఆర్‌సీటీసీ టూరిజం
    Source: IRCTC

    IRCTC Ganga Gaya Sangam Yatra: టూర్ ప్యాకేజీ వివరాలివే


    మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 09:35 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే 11:35 గంటలకు పాట్నాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి బుద్ధ స్మృతి పార్క్‌ సైట్ సీయింగ్ ఉంటుంది. సాయంత్రం బోధ్ గయకు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత మహాబోధి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి బోధ్ గయలోనే బస చేయాలి. రెండో రోజు విష్ణు పదమ్ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత వారణాసికి బయల్దేరాలి. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి. మూడో రోజు కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణీ ఆలయం, కాలభైరవ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత సారనాథ్ సైట్‌సీయింగ్‌కు వెళ్లాలి. సాయంత్రానికి తిరిగి వారణాసికి చేరుకుంటారు. గంగా ఘాట్స్, హారతి సందర్శన ఉంటుంది. రాత్రికి వారణాసిలో బస చేయాలి. నాలుగో రోజు ప్రయాగ్‌రాజ్ (అలాహాబాద్) తీసుకెళ్తారు. త్రివేణీ సంగం, ఆనంద్ భవన్ సందర్శన ఉంటుంది. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి. ఐదో రోజు బెనారస్ హిందూ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన విశ్వనాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం 05:25 వారణాసిలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 08:25 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

    Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కోణార్క్, పూరీ టూర్ ప్యాకేజీ... వివరాలివే

    IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి షిరిడీ టూర్... ప్యాకేజీ వివరాలివే

    IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ టూర్... విశేషాలివే
    Published by:Santhosh Kumar S
    First published: