హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Dubai Tour: ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్... ఓన్లీ ఫర్ లేడీస్

IRCTC Dubai Tour: ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్... ఓన్లీ ఫర్ లేడీస్

IRCTC Dazzling Dubai Womens Special Tour Package | ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, దుబాయ్ వీసా ఫీజ్, 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్‌లు, ఏసీ డీలక్స్ బస్‌లో సైట్ సీయింగ్, దుబాయ్ సిటీ టూర్, డిసర్ట్ సఫారీ, క్రూజ్‌లో ప్రయాణం, హోటల్ అకామడేషన్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివన్నీ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి.

ఇంకా చదవండి ...

  ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. గతేడాది లాగే ఈసారి కూడా 'డాజ్లింగ్ దుబాయ్-వుమెన్స్ స్పెషల్' పేరుతో టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ మహిళలకు మాత్రమే ప్రత్యేకం. మార్చి 8న ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ఈ ప్యాకేజీ రూపొందించింది. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. టూర్ ముంబై నుంచి ప్రారంభమవుతుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.50,000. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, దుబాయ్ వీసా ఫీజ్, 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్‌లు, ఏసీ డీలక్స్ బస్‌లో సైట్ సీయింగ్, దుబాయ్ సిటీ టూర్, డిసర్ట్ సఫారీ, క్రూజ్‌లో ప్రయాణం, హోటల్ అకామడేషన్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివన్నీ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  IRCTC Dazzling Dubai: ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ వివరాలివే...

  ఐఆర్‌సీటీసీ డాజ్లింగ్ దుబాయ్-వుమెన్స్ స్పెషల్ టూర్ ప్యాకేజీ 2020 మార్చి 8న ప్రారంభమవుతుంది. ముంబైలో తెల్లవారుజామున 04:55 గంటలకు ముంబైలో ఫ్లైట్ ఎక్కితే షార్జాకు ఉదయం 06:35 గంటలకు చేరుకుంటారు. షార్జాకు చేరుకున్న తర్వాత దుబాయ్‌కి తీసుకెళ్తారు. ఇండియన్ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. మిరాకిల్ గార్డెన్‌ సందర్శించిన తర్వాత హోటల్‌కు చేరుకోవాలి. మధ్యాహ్నం షాపింగ్‌కు వెళ్లాలి. సాయంత్రం ధో క్రూజ్‌కు తీసుకెళ్తారు. అక్కడే బఫే డిన్నర్ ఉంటుంది. రాత్రికి హోటల్‌లో బస చేయాలి. మార్చి 9న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుబాయ్ సిటీ టూర్ ఉంటుంది. దుబాయ్ మ్యూజియంతో పాటు ఇతర కట్టడాలను సందర్శించాలి. మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్ మాల్‌లో షాపింగ్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత బుర్జ్ ఖలీఫా సందర్శన ఉంటుంది. రాత్రికి దుబాయ్‌లోనే హోటల్‌లో బస చేయాలి.

  మార్చి 10న ఉదయం దుబాయ్ మార్కెట్‌లో షాపింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు డిసర్ట్ సఫారీకి తీసుకెళ్తారు. రాత్రికి దుబాయ్‌లోనే బస చేయాలి. మార్చి 11న ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అబు ధాబీ సిటీ టూర్ ఉంటుంది. షేక్ జయేద్ మసీదు, ఫెరారీ వాల్డ్ సందర్శన ఉంటుంది. మార్చి 12న హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత దుబాయ్‌లోనే అతిపెద్ద మాల్ అయిన మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌కు తీసుకెళ్తారు. థీమ్ పార్క్, స్నో పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత షార్జాకు తీసుకెళ్తారు. షార్జాలో రాత్రి 11:45 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మరుసటిరోజు తెల్లవారుజామున 04:15 గంటలకు ముంబై చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

  LG W30 Pro: ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ ప్రారంభం... ఫోన్ ఎలా ఉందో చూడండి

  ఇవి కూాడా చదవండి:

  IRCTC: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ మారాయి

  Special Train: అయ్యప్ప భక్తులకు శుభవార్త... నవంబర్ 17 నుంచి ప్రత్యేక రైలు

  Jio New Plans: రిలయెన్స్ జియో కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

  First published:

  Tags: Best tourist places, Dubai, IRCTC, Tourism

  ఉత్తమ కథలు