IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి దుబాయ్ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC | ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ రూ.50,990 నుంచి ప్రారంభమవుతుంది. అందులో విమాన ఛార్జీలు, త్రీ స్టార్ హోటళ్లలో బస, వీసా ఫీజ్, భోజనం, ఏసీ బస్సుల్లో ప్రయాణం కలిపే ఉంటాయి.

news18-telugu
Updated: June 21, 2019, 12:23 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి దుబాయ్ టూర్... ప్యాకేజీ వివరాలివే
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి దుబాయ్ టూర్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది. దేశీయంగానే కాదు... విదేశాలకూ పర్యాటకుల్ని తీసుకెళ్తోంది. ఐదు రోజులు, నాలుగు రాత్రులతో దుబాయ్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. 'డాజ్లింగ్ దుబాయ్ ఇంటర్నేషనల్ టూర్ ఎక్స్ ముంబై' పేరుతో రూపొందించిన ప్యాకేజీ ధర రూ.50,990 నుంచి ప్రారంభమవుతుంది. ముంబై నుంచి షార్జా, దుబాయ్, అబుధాబీ ప్రాంతాలను పర్యాటకులకు చూపించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21, అక్టోబర్ 12, నవంబర్ 2, నవంబర్ 9, డిసెంబర్ 21, వచ్చే ఏడాది జనవరి 25 తేదీల్లో టూర్ మొదలవుతుంది. ఆసక్తిగలవాళ్లు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ ఛార్జీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

IRCTC, Dazzling Dubai tour package, IRCTC dubai tour package, irctc dubai tour package 2019, irctc tour packages, irctc tourism, irctc tours, ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌సీటీసీ డాజ్లింగ్ దుబాయ్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్, ఐఆర్‌సీటీసీ ప్యాకేజెస్, ఐఆర్‌సీటీసీ టూరిజం
image: IRCTC


ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ రూ.50,990 నుంచి ప్రారంభమవుతుంది. అందులో విమాన ఛార్జీలు, త్రీ స్టార్ హోటళ్లలో బస, వీసా ఫీజ్, భోజనం, ఏసీ బస్సుల్లో ప్రయాణం కలిపే ఉంటాయి. ప్రతీ రోజు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ కలిపే ఉంటుంది. ముందుగా ముంబై నుంచి ఎయిర్ అరేబియా ఫ్లైట్‌లో షార్జాకు తీసుకెళ్తారు. అక్కడ్నుంచి దుబాయ్‌కి తీసుకెళ్తారు. మిరాకిల్ గార్డెన్‌లో బస తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. రెండో రోజు దుబాయ్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. మూడో రోజు డిసెర్ట్ సఫారీ, నాలుగో రోజు అబుధాబికి ప్రయాణం ఉంటుంది. ఐదో రోజున షార్జా నుంచి ముంబైకి రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది. ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI Home Loan: ఎస్‌బీఐ హోమ్ లోన్ ఆఫర్... అతి తక్కువ వడ్డీ రేట్లుSmartphone: మీ ఫోన్ పోయిందా? ఒక్క కాల్‌తో బ్లాక్ చేయొచ్చు

SBI Student Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్
Published by: Santhosh Kumar S
First published: June 21, 2019, 12:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading