కరోనా లాక్డౌన్ ఆంక్షలు దాదాపుగా తొలగిపోవడంతో ఐఆర్సీటీసీ మళ్లీ తన టూరిజం బిజినెస్‌ను పట్టాలెక్కించింది. వరుసగా టూరిస్ట్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్‌ను మళ్లీ ప్రారంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్లో దక్షిణ భారతదేశ యాత్రను ప్రకటించింది ఐఆర్సీటీసీ. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు. తిరుచ్చిరాపల్లి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లొచ్చు. ఆసక్తిగల పర్యాటకులు https://www.irctctourism.com/ వెబ్సైట్లో ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. 2020 డిసెంబర్ 12 టూర్ ప్రారంభమవుతుంది. ఇది 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ. ఐఆర్సీటీసీ దక్షిణ భారతదేశ యాత్ర టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7140. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.8610. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, ధర్మశాలలు, హాల్స్, డార్మిటరీల్లో బస, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజూ లీటర్ వాటర్ బాటిల్ లాంటివి కవర్ అవుతాయి. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాస్ ప్రయాణం ఉంటుంది.
IRCTC: రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసిందా? ఐఆర్సీటీసీ అండమాన్ టూర్‌కు వెళ్లండిలా
LIC Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెల రూ.19,000 మీ అకౌంట్లోకి
డిసెంబర్ 12 అర్థరాత్రి 12 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరుతుంది. దారిలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో పర్యాటకులు ఈ రైలు ఎక్కుతారు. మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు తిరుచ్చిరాపల్లి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి. డిసెంబర్ 13న ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీరంగం, బృహదీశ్వర ఆలయాల సందర్శన ఉంటుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకు తిరుచ్చిరాపల్లి నుంచి బయల్దేరతారు. మరుసటి రోజు డిసెంబర్ 14 తెల్లవారుజామున 5 గంటలకు రామేశ్వరం చేరుకుంటారు. అక్కడే సముద్ర స్నానం, 22 తీర్థం, రామనాథస్వామి దర్శనం పూర్తి చేసుకోవాలి. రాత్రికి రామేశ్వరంలోనే బస చేయాలి. డిసెంబర్ 15 ఉదయం 10 గంటలకు రామేశ్వరం నుంచి బయల్దేరాలి. మధ్యాహ్నం 2 గంటలకు మధురై చేరుకుంటారు. మధుర మీనాక్షి ఆలయ సందర్శన ఉంటుంది. అదే రోజు రాత్రి 11.45 గంటలకు మధురై నుంచి బయల్దేరాలి.
Flipkart Big Diwali sale: రెడ్మీ నుంచి రియల్మీ వరకు... ఈ 12 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
డిసెంబర్ 16 తెల్లవారుజామున 5 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటారు. ఆ తర్వాత కన్యాకుమారిలో నాగర్‌కోయిల్ ఆలయం, కుమారి అమ్మన్ ఆలయం, గాంధీ మెమోరియల్, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లూర్ స్టాచ్యూ, సన్‌సెట్ వ్యూ సందర్శించొచ్చు. కన్యాకుమారిలో యాత్ర ముగుస్తుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు కన్యాకుమారిలో బయల్దేరితే పర్యాటకులు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్‌లో దిగడంతో యాత్ర ముగుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Irctc, IRCTC Tourism, Secunderabad, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Vijayawada, Visakhapatnam, Warangal