IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి భారత్ దర్శన్ ట్రైన్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Jagannath Kamakhya Yatra with Gaya | ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడలో రైలు ఎక్కొచ్చు. 2020 జనవరి 17 నుంచి 2020 జనవరి 26 వరకు ఈ టూర్ కొనసాగుతుంది.

news18-telugu
Updated: December 3, 2019, 3:07 PM IST
IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి భారత్ దర్శన్ ట్రైన్... ప్యాకేజీ వివరాలివే
IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి భారత్ దర్శన్ ట్రైన్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యాత్రలకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్ సర్వీస్‌లో భాగంగా 'జగన్నాథ్ కామాఖ్య యాత్ర విత్ గయ' పేరుతో ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీని రూపొందించింది. సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ టూర్ పూరీ, భువనేశ్వర్, హౌరా, గువాహతి, గయ, విశాఖపట్నం ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.9450 మాత్రమే. థర్డ్ ఏసీ ప్యాకేజీ ధర రూ.11550. ప్యాకేజీలో స్లీపర్ క్లాస్‌లో రైలు ప్రయాణం, ధర్మశాలలు, హాల్స్, డార్మిటరీల్లో బస, వసతి ఏర్పాట్లు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ లాంటివి కవర్ అవుతాయి. ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడలో రైలు ఎక్కొచ్చు. 2020 జనవరి 17 నుంచి 2020 జనవరి 26 వరకు ఈ టూర్ కొనసాగుతుంది.

IRCTC Jagannath Kamakhya Yatra with Gaya: ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే...


ఐఆర్‌సీటీసీ జగన్నాథ్ కామాఖ్య యాత్ర 2020 జనవరి 17న ప్రారంభమవుతుంది. అంటే జనవరి 26 అర్థరాత్రి 12:05 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కాలి. ఆ రోజంతా రైలు ప్రయాణమే ఉంటుంది. రాత్రికి పూరీ చేరుకుంటారు. జనవరి 18న బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పూరీ జగన్నాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత భువనేశ్వర్ బయల్దేరాలి. అక్కడ లింగరాజ ఆలయ సందర్శన, సైట్ సీయింగ్ ఉంటుంది. అదేరోజు భువనేశ్వర్ నుంచి హౌరాకు బయల్దేరాలి. జనవరి 19న ఉదయం హౌరాకు చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం, మఠం, మ్యూజియం సందర్శన, సిటీ టూర్ ఉంటుంది. అదేరోజు రాత్రి హౌరా నుంచి బయల్దేరాలి. జనవరి 20న గువాహతికి చేరుకుంటారు. రాత్రికి గువాహతిలో ఫ్రెషప్ కావాలి. జనవరి 21న కామాఖ్య ఆలయ సందర్శన, సైట్ సీయింగ్ ఉంటాయి. అదేరోజు గువాహతి నుంచి బయల్దేరాలి.




Loading...
జనవరి 22న గయకు చేరుకుంటారు. అదే రోజున బోధ్ గయ సందర్శన ఉంటుంది. రాత్రికి గయలోనే బస చేయాలి. జనవరి 23న పిండప్రదానం చేసేవాళ్లు ఆ కార్యక్రమాలు ముగించుకోవచ్చు. స్థానిక ఆలయాల సందర్శన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత గయ నుంచి బయల్దేరాలి. జనవరి 24న విశాఖపట్నానికి చేరుకుంటారు. విశాఖ బీచ్‌ సందర్శన, సిటీ టూర్ ఉంటుంది. రాత్రికి విశాఖలోనే బస చేయాలి. జనవరి 25న సింహాచలం ఆలయ సందర్శన ఉంటుంది. లంచ్ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. సాయంత్రం రాజమండ్రి, రాత్రి విజయవాడ, ఖమ్మం, జనవరి 26న తెల్లవారుజామున వరంగల్, ఉదయం సికింద్రాబాద్‌కు రైలు చేరుకుంటుంది. దీంతో టూర్ ముగుస్తుంది.

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IRCTC Araku Tour: అద్దాల రైలులో అరకు వెళ్తారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ఇదే

IRCTC Bharat Darshan: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్... దక్షిణ భారతదేశ యాత్ర రూ.7,560 మాత్రమే

IRCTC Agent Scheme: పెట్టుబడి రూ.3999... నెలకు ఆదాయం రూ.80,000... బిజినెస్ ఐడియా ఇదే
First published: December 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...