తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC శుభవార్త చెప్పింది. తిరుపతి నుంచి కాశ్మీర్‌కు భారత్ దర్శన్ టూరిస్ట్ రైలును ప్రకటించింది. ఢిల్లీ, శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్, వైష్ణోదేవి లాంటి ప్రాంతాలు ఈ టూర్లో కవర్ అవుతాయి. 11 రాత్రులు 12 రోజుల టూర్ ఇది. 2020 మే 27న ఈ టూర్ తిరుపతిలో ప్రారంభమవుతుంది. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రామగుండం, కాజిపేట్, నల్గొండ, సికింద్రాబాద్, నాగ్‌పూర్‌లో ఈ రైలు ఆగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకొని ఎక్కడైనా రైలు ఎక్కొచ్చు. ఆర్సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌తో పాటు, ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, రీజనల్ కార్యాలయాల్లో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
ఐఆర్సీటీసీ భారత్ దర్శన్ టూర్ ప్యాకేజీ స్లీపర్ క్లాస్ ధర రూ.19,215 కాగా, థర్డ్ ఏసీ ధర రూ.21,735. ప్యాకేజీలో రైలు ప్రయాణం, ధర్మశాలలు, డార్మిటరీల్లో బస, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌తో పాటు సైట్ సీయింగ్ కవర్ అవుతాయి. ఐప్యాకేజీ బుక్ చేసిన తర్వాత 15 రోజుల లోపు క్యాన్సిల్ చేస్తే రూ.250 క్యాన్సలేషన్ ఛార్జీ ఉంటుంది. ఒకవేళ 8 నుంచి 14 రోజుల్లోపు క్యాన్సిల్ చేస్తే 25% క్యాన్సలేషన్ ఛార్జీ, 4 నుంచి 7 రోజుల్లోపు క్యాన్సిల్ చేస్తే 50% క్యాన్సలేషన్ ఛార్జీ వర్తిస్తుంది. టూర్‌కు 4 రోజుల ముందు క్యాన్సలేషన్ చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు.
ఇవి కూడా చదవండి:
SBI Salary Account: ఎస్బీఐలో సాలరీ అకౌంట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఇవే...
Aadhaar Address: ఆధార్‌లో చిరునామా మార్చాలా? ఈ 45 అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు
Savings Account: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ టిప్స్‌తో మీ డబ్బులు సేఫ్Published by:Santhosh Kumar S
First published:March 16, 2020, 12:03 IST