IRCTC OFFERS ARCHANAM TOUR PACKAGE ON EVERY THURSDAY FROM HYDERABAD COVERS TIRUMALA TIRUPATI TIRUCHANURU KANIPAKAM SREE KALAHASTHI SREEPURAM SS
IRCTC Tirupati Tour: ఐఆర్సీటీసీ నుంచి హైదరాబాద్-తిరుమల టూర్... ప్యాకేజీ వివరాలివే
80 రోజుల అనంతరం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది.
IRCTC Tirumala Tour from Hyderabad | తిరుమల వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి తిరుమల తిరుపతికి ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఆ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.
తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? తిరుపతి టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC 'అర్చనం' పేరుతో ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రతీ గురువారం హైదరాబాద్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. తిరుపతి, తిరుమల, కాణిపాకం, శ్రీపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను కవర్ చేస్తుంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేసి ప్యాకేజీ బుక్ చేసుకోవాలి. టూర్ ప్యాకేజీలో స్లీపర్ లేదా థర్డ్ ఏసీ ప్రయాణం, తిరుపతిలో ఏసీ అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
IRCTC Archanam Tour Package: ఐఆర్సీటీసీ అర్చనం టూర్ ప్యాకేజీ వివరాలివే...
ఐఆర్సీటీసీ అర్చనం టూర్ ప్రతీ గురువారం ఉంటుంది. గురువారం సాయంత్రం 06:30 గంటలకు పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కాలి. శుక్రవారం ఉదయం 7:00 గంటలకు తిరుపతి చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత ఫ్రెషప్ కావాలి. 10:30 గంటలకు తిరుపతి నుంచి కాణిపాకం బయల్దేరాలి. 11:30 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. 12:30 గంటల వరకు దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీపురం బయల్దేరాలి. మధ్యాహ్నం 02:00 గంటలకు శ్రీపురం చేరుకుంటారు. 03:45 గంటలకు దర్శనం చేసుకోవాలి. సాయంత్రం 04:00 గంటలకు శ్రీకాళహస్తి బయల్దేరాలి. రాత్రి 07:30 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుంటారు. రాత్రి 08:30 గంటల వరకు దర్శనం చేసుకొని బయల్దేరాలి. రాత్రి 09:30 గంటలకు తిరుపతి చేరుకుంటారు. రాత్రికి తిరుపతిలో బస చేయాలి.
ప్రతీకాత్మక చిత్రం
శనివారం ఉదయం 08:00 గంటలకు హోటల్లో చెకౌట్ చేసి తిరుమలకు బయల్దేరాలి. ఉదయం 09:30 గంటలకు తిరునమల చేరుకుంటారు. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 01:00 గంటలకు దర్శనం ముగుస్తుంది. 02:00 గంటల వరకు షాపింగ్ చేసుకొని తిరుపతి బయల్దేరాలి. మధ్యాహ్నం 03:30 గంటలకు తిరుపతి చేరుకుంటారు. సమయం ఉంటే తిరుచానూర్ ఆలయానికి తీసుకెళ్తారు. సాయంత్రం 05:00 గంటలకు తిరుపతిలో పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఆదివారం ఉదయం 05:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ అర్చనం టూర్ ప్యాకేజీ రెండు క్లాసుల్లో లభిస్తుంది. కంఫర్ట్ క్లాస్లో సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.10,050, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,830, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,620. స్టాండర్డ్ క్లాస్లో సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,120, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,900, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,690. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.