హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసిందా? ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్‌కు వెళ్లండిలా

IRCTC: రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసిందా? ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్‌కు వెళ్లండిలా

IRCTC: రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసిందా? ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్‌కు వెళ్లండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసిందా? ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్‌కు వెళ్లండిలా (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Andaman Emeralds Holiday Tour | కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ ఇంట్లోనే ఉంటూ బోర్‌గా ఫీలవుతున్నారా? ఈ రొటీన్ లైఫ్ బాగా బోర్ కొట్టేసిందా? ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం అండమాన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

ఇంకా చదవండి ...

  ఐఆర్‌సీటీసీ టూరిజం 'అండమాన్ ఎమరాల్డ్స్ హాలిడే టూర్' పేరుతో ప్యాకేజీ అందిస్తోంది. ఇది 5 రాత్రులు 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ స్టాండర్డ్, డీలక్స్ పేర్లతో రెండు రకాలుగా ఉంటుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.24065. ప్యాకేజీలో ఏసీ అకామడేషన్, పికప్ డ్రాప్, సైట్ సీయింగ్, మీల్స్ లాంటివి కవర్ అవుతాయి. ప్రతీ రోజు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో విహరించాలనుకునేవారికి ఇది బెస్ట్ ప్యాకేజీ. పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  Day 1: ఈ ప్యాకేజీ మొదటి రోజు పోర్ట్‌ బ్లెయిర్‌లో మొదలవుతుంది. కాబట్టి ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ముందుగానే పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకోవాలి. పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్ దగ్గర పర్యాటకులను ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్‌కు తీసుకెళ్తారు. పోర్ట్‌బ్లెయిర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెల్యులార్ జెయిల్‌కు తీసుకెళ్తారు. అక్కడే లైట్ అండ్ సౌండ్ షో చూడొచ్చు. రాత్రి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి.

  Day 2: రెండో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత నీల్ ఐల్యాండ్‌, భరత్ నగర్ బీచ్‌కు తీసుకెళ్తారు. స్విమ్మింగ్, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ లాంటివి ఎంజాయ్ చేయొచ్చు. పర్యాటకులు వీటికి సొంతగా ఖర్చు చేయాలి. సాయంత్రం లక్ష్మణ్ పూర్ బీచ్‌లో సూర్యాస్తమయం ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి హోటల్‌లో బస చేయాలి.

  Flipkart Big Diwali sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 7 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

  Photos: గిన్నీస్ రికార్డ్ సృష్టించిన Diamond Ring ఇదే... ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్

  Day 3: మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత నేచురల్ బ్రిడ్జ్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత హేవ్‌లాక్‌కు క్రూజ్‌లో తీసుకెళ్తారు. హేవ్‌లాక్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత లంచ్ చేయాలి. ఆ తర్వాత రాధానగర్ బీచ్, కాలాపత్తర్ బీచ్ తీసుకెళ్తారు. రాత్రికి హేవ్‌లాక్‌లోనే బస చేయాలి.

  Day 4: నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెకౌట్ చేయాలి. ఆ తర్వాత పర్యాటకులు సొంత ఖర్చులతో ఎలిఫాంటా బీచ్ చూడొచ్చు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనొచ్చు. ఆ తర్వాత హేవ్‌లాక్‌కు క్రూజ్‌లో తిరిగి రావాలి. సాయంత్రానికి పోర్ట్‌బ్లెయిర్‌కు తీసుకెళ్తారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి.

  Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ

  JioPhone: జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.50,000 గెలుచుకోండి ఇలా

  Day 5: ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రాస్ ఐల్యాండ్‌కు తీసుకెళ్తారు. చీఫ్ కమిషనర్స్ హౌజ్, గవర్నమెంట్ హౌజ్, చర్చ్, బేకరీ, ప్రెస్, స్విమ్మింగ్ పూల్, సిమెట్రీ లాంటివి చూయిస్తారు. ఆ తర్వా నార్త్ బే ఐల్యాండ్‌కు తీసుకెళ్తారు. అక్కడ ప్రయాణికులు సొంత ఖర్చులతో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనొచ్చు. సాయంత్రం షాపింగ్ కోసం సమయం కేటాయిస్తారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి.

  Day 6: ఆరో రోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి తిరిగి బయల్దేరాలి. పర్యాటకుల్ని పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టడంతో టూర్ ముగుస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Best tourist places, Irctc, IRCTC Tourism, Tourism

  ఉత్తమ కథలు