హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vrat Thali: ఉపవాసం ఉండే రైల్వే ప్రయాణికులకు స్పెషల్ ఫుడ్.. నవరాత్రి సందర్భంగా ఐఆర్‌సీటీసీ వ్రత్ థాలీ..

Vrat Thali: ఉపవాసం ఉండే రైల్వే ప్రయాణికులకు స్పెషల్ ఫుడ్.. నవరాత్రి సందర్భంగా ఐఆర్‌సీటీసీ వ్రత్ థాలీ..

Vrat Thali: ఉపవాసం ఉండే రైల్వే ప్రయాణికులకు స్పెషల్ ఫుడ్.. నవరాత్రి సందర్భంగా ఐఆర్‌సీటీసీ వ్రత్ థాలీ..

Vrat Thali: ఉపవాసం ఉండే రైల్వే ప్రయాణికులకు స్పెషల్ ఫుడ్.. నవరాత్రి సందర్భంగా ఐఆర్‌సీటీసీ వ్రత్ థాలీ..

Vrat Thali: దేవీ నవరాత్రుల సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే భక్తులు రైళ్లలో వెళ్లేటప్పుడు భోజనం విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి కోసం ‘వ్రత్ థాలీ’ (Vrat Thali) పేరుతో స్పెషల్ ఫుడ్ అందించనున్నట్లు ప్రకటించింది ఐఆర్‌సీటీసీ.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే రైల్వే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వీరి కోసం ప్రత్యేక ప్యాకేజీతో స్పెషల్ ట్రైన్స్ (Special Trains) సైతం నడుపుతుంటుంది. మరికొన్ని రోజుల్లో దేవీ నవరాత్రి (Devi Navaratri) ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది భక్తులు దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి రైళ్లలో వెళుతుంటారు. అలాగే దేవీ నవరాత్రుల సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే భక్తులు రైళ్లలో వెళ్లేటప్పుడు భోజనం విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి కోసం ‘వ్రత్ థాలీ’ (Vrat Thali) పేరుతో స్పెషల్ ఫుడ్ అందించనున్నట్లు ప్రకటించింది ఐఆర్‌సీటీసీ.

ఉపవాస సమయాల్లో చాలా మంది భోజనం తినరు. సాధారణంగా పండ్లు, ఫలహారాలు తినడానికి ఇష్టపడతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీసీ దేవీ నవరాత్రుల సందర్భంగా స్పెషల్ ‘వ్రత్ థాలీ’ని ప్రవేశపెట్టనుంది. థాలీల్లో చాలా రకాలు ఉంటాయి. నార్త్, సౌత్ ఇండియన్, చైనీస్, వెజ్/నాన్‌వెజ్, టిఫిన్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. తాజాగా ఉపవాస దీక్ష చేసే రైల్వే ప్రయాణికుల కోసం స్పెషల్ థాలీని ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టనుంది.

* 400 రైల్వే స్టేషన్లలో..

దేవీ నవరాత్రుల సందర్భంగా ఉపవాసం ఆచరించే రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ నుంచి వ్రత్ థాలీని ఆర్డర్ చేయవచ్చు. ఇది దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉండనుంది. కేవలం వెజిటేరియన్ ఐటెమ్స్ మాత్రమే ఇందులో ఉంటాయి.

* వ్రత్ థాలీ- మెనూ

వ్రత్ థాలీ-మెనూ ప్రధానంగా మూడు ధరల కేటగిరిలో అందుబాటులో ఉంది. రూ.99కి అందించే థాలీలో పండ్లు, బుక్వీట్ పకోరి, పెరుగు ఉంటాయి. రూ.99కి లభించే మరో వ్రత్ థాలీలో రెండు పరాటాలు, బంగాళదుంప కూర, సాగో పాయసం అందిస్తారు. అలాగే రూ.199 వ్రత్ థాలీలో నాలుగు పరోటాలు, కూరగాయల కూర, సాగో కిచ్డీ ఉంటాయి. రూ.250 వ్రత్ థాలీలో పనీర్ పరాఠా, వ్రత్ మసాలా, సింగదా, ఆలూ పరాఠా అందిస్తారు.

ఇది కూడా చదవండి  : గుడ్ న్యూస్... డ్రైవింగ్ లైసెన్స్ సహా 58 సేవలు ఆన్‌లైన్‌లోనే

* నవరాత్రి ప్లేట్‌ పేరుతో..

ఐఆర్‌సీటీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపవాసంలో ఉన్న ప్రయాణికులకు ఇకపై భోజనం టెన్షన్ ఉండదు. ఈ ప్రత్యేక వ్రత్‌థాలీ నవరాత్రి ప్లేట్‌ పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ థాలీ కావాలనుకునే ప్రయాణికులు 1323కి కాల్ చేసి బుక్ చేసుకోవాలి. కొన్ని నిమిషాల తరువాత మీ సీటు వద్దకు క్లీన్ ఫాస్టింగ్ ప్లేట్ డెలివరీ చేయనున్నారు.

* డిమాండ్‌ను బట్టి కొనసాగింపు..

ఐఆర్‌సీటీసీ పీఆర్‌ఓ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ...నవరాత్రి ఉపవాస సమయంలో చాలా మంది ప్రయాణికులు ఆహారం, పానీయాల గురించి ఆందోళన చెందుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ స్పెషల్ థాలీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఈ ప్రత్యేక ఏర్పాటును మరింత కొనసాగిస్తామని తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Food, Indian Railways, IRCTC, Navaratri

ఉత్తమ కథలు