IRCTC-SBI Offer: రివార్డ్ పాయింట్స్‌తో రైలు టికెట్ కొనొచ్చు... ప్రాసెస్ ఇదే

IRCTC-SBI Offer | ఎప్పుడైనా టికెట్ కొనాలంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా రివార్డ్ పాయింట్స్‌తో టికెట్ కొనొచ్చు. రైలు టికెట్ కొనేందుకు రివార్డ్ పాయింట్స్ ఎలా రీడీమ్ చేసుకోవాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: March 25, 2019, 5:06 PM IST
IRCTC-SBI Offer: రివార్డ్ పాయింట్స్‌తో రైలు టికెట్ కొనొచ్చు... ప్రాసెస్ ఇదే
IRCTC-SBI Offer: రివార్డ్ పాయింట్స్‌తో రైలు టికెట్ కొనొచ్చు... ప్రాసెస్ ఇదే
news18-telugu
Updated: March 25, 2019, 5:06 PM IST
ఐఆర్‌సీటీసీలో లాయల్టీ ప్రోగ్రామ్ గురించి చాలామందికి తెలియదు. లాయల్టీ ప్రోగ్రామ్ కింద డిస్కౌంట్లు పొందొచ్చు. ఈ బెనిఫిట్స్ పొందాలంటే మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినమ్ కార్డు ఉండాలి. ఈ కార్డుతో ఏసీ టికెట్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఎస్‌బీఐ కార్డ్ ట్రావెల్ రివార్డ్ పాయింట్స్ కూడా పొందొచ్చు. రివార్డ్ పాయింట్స్ కేవలం ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటీవ్ చెయిర్ కార్, ఏసీ చైర్ కార్ టికెట్లపైనే లభిస్తాయి. స్లీపర్ క్లాస్‌పైన రివార్డ్ పాయింట్స్ లభించవు. రైలు టికెట్ కొనేందుకు రూ.125 ఖర్చు చేస్తే ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. ఒక రివార్డ్ పాయింట్ రూ.1తో సమానం. అంతేకాదు... ఎస్‌బీఐ ప్లాటినమ్ కార్డుతో టికెట్లు కొంటే ట్రాన్సాక్షన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. టికెట్ ధరపై 1.8 శాతం ఆదా అవుతుంది.

Read this: Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 21 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

IRCTC Loyalty Scheme, irctc loyalty account login, how to use sbi irctc credit card reward points, how to redeem irctc loyalty points, how to use irctc sbi credit card for ticket booking, how to use loyalty account in irctc, how to use loyalty account in irctc, irctc, loyalty program, sbi loyalty program, ఐఆర్‌సీటీసీ లాయల్టీ స్కీమ్, ఐఆర్‌సీటీసీ లాయల్టీ ప్రోగ్రామ్, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ లాయల్టీ స్కీమ్, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ లాయల్టీ ప్రోగ్రామ్, ఎస్‌బీఐ పాయింట్స్ రీడీమ్

ఎస్‌బీఐ ప్లాటినమ్ కార్డుపై పొందిన రివార్డ్ పాయింట్స్‌తో రైలు టికెట్లు కూడా కొనుక్కోవచ్చు. రివార్డ్ పాయింట్స్ 3 ఏళ్ల పాటు ఉపయోగించకపోతే ల్యాప్స్ అవుతాయి. ఎస్‌బీఐ ప్లాటినమ్ కార్డు ఉంటే ఒకసారి రివార్డ్ పాయింట్స్ చెక్ చేసుకోండి. ఎప్పుడైనా టికెట్ కొనాలంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా రివార్డ్ పాయింట్స్‌తో టికెట్ కొనొచ్చు. రైలు టికెట్ కొనేందుకు రివార్డ్ పాయింట్స్ ఎలా రీడీమ్ చేసుకోవాలో తెలుసుకోండి.



ముందుగా లాయల్టీ ప్రోగ్రామ్‌కు మీ ఐఆర్‌సీటీసీ లాగిన్ ఐడీ లింక్ చేయాలి.
లాయల్టీ ప్రోగ్రామ్‌కు లింక్ ఉన్న ఐఆర్‌సీటీసీ ఐడీతో లాగిన్ కావాలి.
మీ జర్నీ వివరాలు ఎంటర్ చేసి టికెట్ బుక్ చేయాలి.
Loading...
"Book" బటన్‌ పైన క్లిక్ చేసిన తర్వాత రిడింప్షన్ బటన్ క్లిక్ చేయాలి.
"Confirm & Continue Booking" బటన్ ప్రెస్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
మీ లాయల్టీ మెంబర్ వివరాలను సిస్టమ్ సేకరిస్తుంది.
క్యాప్చా కోడ్, ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి.
ఐఆర్‌సీటీసీ రిజిస్టర్డ్ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
"Confirm" బటన్ క్లిక్ చేస్తే టికెట్ బుక్ అవుతుంది.
1 రివార్డ్ పాయింట్ రూ.1తో సమానం. మీ దగ్గర ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉంటే అన్ని రూపాయలు ఉన్నట్టే.

Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

IPL Offer: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రీఛార్జ్ ఆఫర్లు ఇవే

WhatsApp: ఒక మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేశారు? ఇక లెక్క తేల్చనున్న వాట్సప్

Credit Score: క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఇలా పెంచుకోవచ్చు
First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626