వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిందా? Work From Hotel ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

Work From Hotel: వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిందా? 'వర్క్ ఫ్రమ్ హోటల్' ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)

Work From Hotel | వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిందా? ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేస్తూ విసుగొచ్చిందా? మీలాంటివాళ్ల కోసం 'వర్క్ ఫ్రమ్ హోటల్' టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‍సీటీసీ.

 • Share this:
  కరోనా వైరస్ మహమ్మారి మొదలైననాటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు ఉన్నారు. అయితే రోజూ ఇంట్లోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ, కాలు బయటకు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టేసింది. సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయపెడుతోంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టినవారి కోసం 'వర్క్ ఫ్రమ్ హోటల్' పేరుతో ప్యాకేజీ ప్రకటించింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. ఈ కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. గతేడాది కూడా పాపులర్ అయింది. ఇప్పుడు ఐఆర్‍సీటీసీ టూరిజం 'వర్క్ ఫ్రమ్ హోటల్' పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. కేరళలోని హోటళ్లలో కొన్ని రోజుల పాటు ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

  Money Transfer: వేరే అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇలా చేయండి

  Personal Loan: ఉద్యోగులకు రూ.4,00,000 వరకు లోన్... ఎలా తీసుకోవాలంటే

  ఐఆర్‍సీటీసీ టూరిజం 'వర్క్ ఫ్రమ్ హోటల్' టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,126. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి ఐదు రాత్రులు హోటల్‌లో బస, మూడు పూటలా భోజనం, రెండు సార్లు టీ లేదా కాఫీ, వైఫై సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ఎలాంటి సైట్ సీయింగ్ ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. అంటే ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే కేవలం హోటల్‌లో ఉంటూ పనిచేసుకోవచ్చు. ఖాళీ సమయంలో హోటల్‍లోని వాతావరణాన్ని మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లో పనిచేయడం బోర్ కొట్టినవాళ్లు కాస్త మార్పు కోరుకుంటే ఈ ప్యాకేజీ వారికి ఉపయోగపడుతుంది.

  EPF Withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేయొచ్చో తెలుసుకోండి

  SBI Branch Change Online: మీ ఎస్‍బీఐ అకౌంట్ వేరే బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లో మార్చుకోండి ఇలా

  ప్రస్తుతం కేరళలోని హోటళ్లలో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. కేరళలోని మున్నార్, అలెప్పీ, వాయనాడ్, తెక్కడి, కొచ్చిన్, కుమారకోమ్, కోవలం లాంటి ప్రాంతాల్లోని హోటళ్లల్లో ఈ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీ గడువు ఐదు రోజులు మాత్రమే. ఆ తర్వాత మరిన్ని రోజులు పొడిగించుకోవచ్చు. ఎన్ని రోజులు ఎక్కువగా ఉండాలనుకుంటే అందుకు తగ్గట్టుగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేరళలోని మాత్రమే 'వర్క్ ఫ్రమ్ హోటల్' ప్యాకేజీలు అందిస్తున్న ఐఆర్‌సీటీసీ త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్యాకేజీలు అందించనుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
  Published by:Santhosh Kumar S
  First published: