IRCTC: సముద్ర ప్రయాణం చేయాలనుకునే వారికి గుడ్​న్యూస్​... ఐఆర్​సీటీసీలో క్రూజ్ బుకింగ్

IRCTC: సముద్ర ప్రయాణం చేయాలనుకునే వారికి గుడ్​న్యూస్​... ఐఆర్​సీటీసీలో క్రూజ్ బుకింగ్ (image: IRCTC Tourism)

IRCTC Cruise Booking Services | ఐఆర్‌సీటీసీ కొత్తగా క్రూజ్ బుకింగ్ (Cruise Booking) సేవల్ని ప్రారంభించింది. ముంబై నుంచి వేర్వేరు ప్రాంతాలకు ఓడలో ప్రయాణించాలనుకునేవారికి ప్రత్యేకమైన ప్యాకేజీలు (Tour Packages) అందిస్తోంది.

  • Share this:
సముద్రంపై ప్రయాణిస్తూ ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారికి ది ఇండియన్ రైల్వేస్​ కాటరింగ్ అండ్ టూరిజం​ కార్పొరేషన్ లిమిటెడ్​ (IRCTC) గుడ్​న్యూస్ చెప్పింది. ముంబై నుంచి దేశంలోని వివిధ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక క్రూజ్ ప్యాకేజీలను (Cruise Package) ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ, దేశీయ క్రూజ్ (Cruise booking) వ్యాపారంలోకి ఐఆర్​సీటీసీ ఇటీవల ప్రవేశించింది. ముందుగా దేశీయ మార్గెట్​ను టార్గెట్​ చేస్తూ ప్యాకేజీలను ప్రకటించింది.ముంబై నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఓడ ప్రయాణం కోసం కార్డెలా క్రూజెస్​తో ఐఆర్​సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో విలాసవంతమైన కార్డెలా క్రూజ్​లో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేసే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. భారత్​లో సముద్ర తీరం వెంట ఉన్న ప్రాంతాలను చూడాలనుకుంటున్న వారి కోసం క్రూజ్ (ఓడ) బుకింగ్​ సర్వీస్​ను ఐఆర్​సీటీసీ.. ఈ నెలలోనే ప్రారంభించింది. సెప్టెంబర్​, అక్టోబర్, నవంబర్​, డిసెంబర్ నెలల్లో ప్రయాణం కోసం టికెట్లు బుక్​ చేసుకోవచ్చు. ముంబై నుంచి వివిధ ప్రాంతాలకు.. విభిన్న ప్యాకేజీలు అందుబుటులో ఉన్నాయి.

IRCTC: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్... కదిలే రైలులో బర్త్‌డే పార్టీ

ఓడపై ముంబై నుంచి గోవా, డయూ, లక్ష్యదీప్​, కొచ్చి లాంటి నగరాలకు టూరిస్టులు ప్రయాణించవచ్చు. ముంబై నుంచి వివిధ ప్రాంతాలకు క్రూజ్​లో ప్రయాణం చేసేందుకు ప్రజలు ఈ నెల నుంచే ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తొలి దశలో ముంబై నుంచి ప్రయాణాలు ఉండగా.. త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు ఐఆర్​సీటీసీ ప్లాన్ చేస్తోంది.

ఐఆర్​సీటీసీ క్రూజ్ సర్వీస్​ అందిస్తున్న ప్యాకేజీల వివరాలు..


క్రూస్ వీకెండర్​

ప్రయాణ వ్యవధి: 5 రాత్రుళ్లు, 6 రోజులు

ప్రయాణ ప్రారంభ తేదీ: 20 సెప్టెంబర్​

ప్యాకేజీ ధర: ప్రారంభం రూ.23,467 నుంచి

ముంబై నుంచి దక్షిణానికి రెండు సుందరమైన ప్రాంతాలకు ప్రయాణం

IRCTC Ticket Booking: రైలు ప్రయాణికులకు అలర్ట్... టికెట్ బుక్ చేయాలంటే ఈ వివరాలు ఇవ్వాల్సిందే

కేరళ డిలైట్


ప్రయాణ వ్యవధి: 2 రాత్రుళ్లు, 3 రోజులు

ప్రయాణ ప్రారంభ తేదీ: 20 సెప్టెంబర్​

ప్యాకేజీ ప్రారంభ ధర: రూ.19,898 నుంచి

ముంబైలో క్రూజ్​(ఓడ) ఎక్కి కేరళ వరకు ప్రయాణించవచ్చు. అక్కడి పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు.

IRCTC Special Tourist Train: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్... రూ.6,620 ధరకే కాశీకి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

సన్​డౌనర్​ టూ గోవా..


ప్రయాణ వ్యవధి: 2 రాత్రుళ్లు, 3 రోజులు

ప్రయాణ ప్రారంభ తేదీ: 25 సెప్టెంబర్​

ప్యాకేజీ ప్రారంభ ధర: రూ.23,467 నుంచి

ముంబై నుంచి గోవాకు సముద్రంపై ప్రయాణించవచ్చు.

IRCTC Goa Tour: గోవా టూర్ వెళ్లాలా? ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

లక్ష్యదీప్​కు..


వ్యవధి: 5 రాత్రుళ్లు 6 రోజులు

ప్రయాణ ప్రారంభ తేదీ: 27 సెప్టెంబర్​

ప్యాకేజీ ప్రారంభ ధర: రూ.49,745 నుంచి

ఈ ప్యాకేజీల్లో వసతి, భోజనం సదుపాయాలను కూడా ఐఆర్​సీటీసీ కల్పిస్తోంది. అలాగే మరిన్ని విభిన్న రకాల ప్లాన్స్ ఉన్నాయి. రౌండ్ ట్రిప్​ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాగా వచ్చే ఏడాది శ్రీలంకకు కూడా క్రూజ్ సర్వీస్​ను ప్రారంభించాలని ఐఆర్​సీటీసీ ప్లాన్ చేస్తోంది. మరిన్ని వివరాలు ఐఆర్​సీటీసీ టూరిజం అధికారిక వెబ్​సైట్​ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: