IRCTC Cruise Liner: సముద్ర ప్రయాణం ఇష్టమా? ఈ టూర్ ప్యాకేజీలు మీకోసమే

IRCTC Cruise Liner: సముద్ర ప్రయాణం ఇష్టమా? ఈ టూర్ ప్యాకేజీలు మీకోసమే (image: IRCTC)

IRCTC Cruise Liner | భారతదేశంలో మొదటిసారి స్వదేశీ క్రూజ్ లైనర్‌ను (Cruise Liner) ప్రారంభించింది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).

  • Share this:
మీకు సముద్ర ప్రయాణం అంటే ఇష్టమా?.. సముద్రం మార్గం ద్వారా ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లాలని కలలు కంటున్నారా?. అయితే మీకో గుడ్​న్యూస్​. మీ కలను నెరవేర్చేందుకు భారతీయ రైల్వేకు (Indian Railways) చెందిన ఇండియన్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ముందుకొచ్చింది.  ఈనెల 18 నుంచి తొలిసారిగా దేశంలో క్రూజ్​సేవలు (Cruise Services) ప్రారంభించనుంది. ఆసక్తి గల పర్యాటకులు ఐఆర్​సీటీసీ అధికారిక వెబ్‌సైట్ http://www.irctctourism.com లో బుకింగ్‌ చేసుకోవాలని తెలిపింది. సెప్టెంబర్​, అక్టోబర్​, నవంబర్​, డిసెంబర్​ నెలల్లో ప్రయాణం కోసం ముందస్తుగా టికెట్లు బుక్​ చేసుకోవచ్చని కోరింది. తొలుత మంబై నుంచి వివిధ ప్రాంతాలకు కొన్ని ప్యాకేజీలు అందుబాటులోకి రానున్నాయి.

IRCTC: ఐఆర్‌సీటీసీతో కలిసి బిజినెస్ చేయండి... రూ.80,000 వరకు లాభం పొందండి

సహజంగా విదేశాల్లో ఉండే వారికి మాత్రమే ఈ లగ్జరీ క్రూజ్​ లైనర్లు ఎక్కువగా పరిచయం. సముద్ర మార్గంలో విలాసవంతమైన ప్రయాణాలకు ఇవి పెట్టింది పేరు. అయితే భారత్​లోనూ అనేక పర్యాటక ప్రదేశాలు, మెరుగైన సముద్ర మార్గాలు ఉండటంతో ఇక్కడ కూడా దీన్ని ప్రారంభించింది ఐఆర్​సీటీసీ. దీని ద్వారా భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ సేవలను వాటర్​వేస్​ టూరిజంకు చెందిన కార్డెలియా క్రూజెస్​ అనే ప్రైవేట్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ దేశంలో లగ్జరీ క్రూజ్​ లైనర్​ సేవలను నిర్వహిస్తోంది.

IRCTC Recruitment 2021: ఐఆర్‌సీటీసీలో 150 ఉద్యోగాలు... టెన్త్ పాస్ అయితే చాలు

బుకింగ్స్​ ప్రారంభించిన ఐఆర్​సీటీసీ


సెప్టెంబర్​ 18న మొదటి దశలో ముంబై కేంద్రంగా ఐఆర్​సీటీసీ క్రూజ్​ కార్యకలాపాలను ప్రారంభించనుంది. అక్కడి నుంచి దేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాలకు ఈ క్రూజ్​లను నడపనుంది. వచ్చే ఏడాది మే తర్వాత క్రూయిజ్​ను చెన్నైకి తరలించి అనంతరం అక్కడి నుంచి కొలంబో, గాలే, శ్రీలంక, ట్రింకోమలీ, జాఫ్నా తదితర ప్రాంతాలకు పర్యాటక సేవలు అందిస్తామని ఐఆర్​సీటీసీ ప్రకటించింది.

IRCTC Araku Tour: వైజాగ్ టు అరకు టూర్... ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి

ప్రస్తుతం కార్డెలియా ముంబై- గోవా- ముంబై, ముంబై- డయూ -ముంబై, ముంబై- సముద్రం- ముంబై, కొచ్చి- లక్షద్వీప్- ముంబై, ముంబై- సముద్రం- లక్షద్వీప్- సముద్రం- ముంబై మధ్య క్రూయిజ్​ను నడపనుంది. ఈ కార్డెలియా క్రూయిజ్‌లలో ప్రయాణిస్తున్నప్పుడు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్, బార్‌లు, ఓపెన్ సినిమాస్, థియేటర్, కిడ్స్ ఏరియా, జిమ్నాసియం వంటి ఎన్నో ఎంటర్​టైన్​మెంట్​ ప్రోగ్రామ్స్​ను ఆస్వాదించవచ్చని తెలిపింది.
Published by:Santhosh Kumar S
First published: