IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? సెప్టెంబర్ 1 నుంచి సర్వీస్ ఛార్జీ

IRCTC Service Charge | ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లు బుక్ చేసే ప్రయాణికులు సెప్టెంబర్ 1 నుంచి సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి రావొచ్చు. అయితే గతంలో లాగా నాన్ ఏసీకీ రూ.20, ఏసీకీ రూ.40 ఉండదు.

news18-telugu
Updated: August 26, 2019, 4:00 PM IST
IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? సెప్టెంబర్ 1 నుంచి సర్వీస్ ఛార్జీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసేవారికి బ్యాడ్ న్యూస్. ఆన్‌లైన్ టికెటింగ్‌పై సర్వీస్ ఛార్జీని ప్రవేశపెట్టేందుకు ఐఆర్‌సీటీసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసే టికెట్లపై గతంలో ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జీ తీసుకునేది. అప్పుడు ఏసీ టికెట్లకు రూ.40, నాన్ ఏసీ టికెట్లకు రూ.20 సర్వీస్ ఛార్జీ ఉండేది. కానీ నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెంచేందుకు ఆర్థిక శాఖ సర్‌ఛార్జీని తొలగించింది. 2016 నవంబర్ 22 నుంచి ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసేవారికి సర్వీస్ ఛార్జీ లేదు. దీంతో ఐఆర్‌సీటీసీకి రెండేళ్లలో రూ.500 కోట్ల నష్టం వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌-IRCTC ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్-IPO తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుండటంతో మళ్లీ సర్వీస్ ఛార్జీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లు బుక్ చేసే ప్రయాణికులు సెప్టెంబర్ 1 నుంచి సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి రావొచ్చు. అయితే గతంలో లాగా నాన్ ఏసీకీ రూ.20, ఏసీకీ రూ.40 ఉండదు. సర్వీస్ ఛార్జీ కాస్త తక్కువగానే ఉండబోతోంది. ఏసీ టికెట్లకు రూ.30, నాన్ ఏసీ టికెట్లకు రూ.15 సర్వీస్ ఛార్జీ అమలు చేసే ఆలోచనలో ఉంది ఐఆర్‌సీటీసీ. UPI/BHIM అప్లికేషన్స్ ద్వారా పేమెంట్ చేస్తే ఏసీ క్లాసెస్‌కు రూ.20, నాన్ ఏసీ క్లాసెస్‌కు రూ.10 సర్వీస్ ఛార్జీ వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సెబీకి దాఖలు చేసిన రిపోర్ట్‌లో వెల్లడించింది ఐఆర్‌సీటీసీ. అంతేకాదు... UPI/BHIM అప్లికేషన్స్ ద్వారా పేమెంట్స్ జరుపుతున్నవారికి లాటరీ ద్వారా ప్రైజులు ఇస్తున్నట్టు వెల్లడించింది.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో 'మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్' ప్రారంభం... స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే

IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిIRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ టూర్... విశేషాలివే
First published: August 26, 2019, 4:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading