హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ.. బడ్జెట్ ధరలోనే.. పూర్తి వివరాలివే..

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ.. బడ్జెట్ ధరలోనే.. పూర్తి వివరాలివే..

IRCTC

IRCTC

IRCTC: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో కొత్త ట్రావెల్ ప్లాన్‌ను అనౌన్స్ చేసింది. దక్షిణ భారతదేశానికి స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో కొత్త ట్రావెల్ ప్లాన్‌ (Travel Plan)ను అనౌన్స్ చేసింది. దక్షిణ భారతదేశాని(South Indian)కి స్పెషల్ టూర్ ప్యాకేజీ(Tour Package)ని ప్రవేశపెట్టింది. ఈ ఎయిర్ టూర్ ప్యాకేజీలో కన్యాకుమారి, కొచ్చి, కుమరకోమ్, మదురై, మున్నార్, రామేశ్వరం, త్రివేండ్రం వంటి ప్రదేశాలు ఉంటాయి. మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లుగా ఉంటే ఈ టూర్ ప్యాకేజీలో మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యా కుమారి భగవతి దేవి దేవాలయం వంటి వివిధ ఆలయాల సందర్శనలు ఉంటాయి. జైపూర్ నుంచి ప్రారంభమమై, మళ్లీ గమ్య స్థానానికి వచ్చిన తర్వాత టూర్ ముగుస్తుంది. జైపూర్ - మదురై - రామేశ్వరం - కన్యాకుమారి - త్రివేండ్రం - కుమరకోమ్ - మున్నార్ - కొచ్చి - జైపూర్.. ఇలా టూర్ కొనసాగుతుంది. ఎక్కువ ప్రాంతాలు లిస్ట్‌లో ఉండటం వల్ల ప్రయాణికులు ఏడు రోజులకు పైగా కేటాయించాల్సి ఉంటుంది.


బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, హోటల్ స్టే, ప్రయాణ ఖర్చులు.. వంటి అన్ని ముఖ్యమైన సౌకర్యాలు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. వీటితో పాటు టూర్ ప్యాకేజీలో జైపూర్ - మదురై, కొచ్చి - జైపూర్ రిటర్న్ ఎయిర్ ఫేర్ ఫెసిలిటీ ఉంటుంది. ప్యాకేజీలో భాగంగా త్రీ-స్టార్ కేటగిరీ లేదా సమానమైన హోటళ్లలో, AC గదులలో వసతి కల్పిస్తారు.AC వాహనాల ద్వారా విమానాశ్రయాలకు తీసుకెళ్తారు. అలాగే ట్రావెల్ ప్రకారం ఏసీ వాహనాల్లో సందర్శనా స్థలాలకు తీసుకెళ్తారు. షేరింగ్ ప్రాతిపదికన వాహనం కేటాయిస్తారు. ఫుడ్ విషయానికి వస్తే.. 7 బ్రేక్‌ఫాస్ట్‌లు, 1 లంచ్, 7 డిన్నర్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ప్యాకేజీ ఫీజు రూ. 49,550గా నిర్ణయించారు. ఈ ఛార్జీలలో GST కూడా కలిపి ఉంటుంది.


కేరళలో, రామేశ్వరం, మదురైలో చూడాల్సిన ప్రాంతాలకు ఎంట్రీ ఫీజు ప్యాకేజీలో కవర్ కాదు. టూర్ ఎస్కార్ట్ సేవలు, గైడ్ సేవలు, భోజనం/ వెళ్లే మార్గంలో భోజనం, ఏదైనా అదనపు అవసరాలు, ప్రయాణంలో పేర్కొనని సందర్శనా స్థాలాలకు రుసుమును ప్రాయాణికులే భరించాల్సి ఉంటుంది.


* టూర్ ప్యాకేజీ వివరాలు


ప్యాకేజీ పేరు- Rameshwaram Madurai With Kerala EX Jaipur (NJA06)
ఎన్ని రోజులు- 7 రాత్రులు, 8 రోజులు

మీల్ ప్లాన్- బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్

ట్రావెల్ మోడ్ - ఫ్లైట్

కవర్ అయ్యే డెస్టినేషన్స్- మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరువనంతపురం, కుమరకోమ్, మున్నార్, కొచ్చి

బయలుదేరే తేదీలు- 2022 సెప్టెంబర్ 12, అక్టోబర్ 12 , నవంబర్ 7, డిసెంబర్ 19, డిసెంబర్ 26, 2023 జనవరి 16, ఫిబ్రవరి 16


ఇది కూడా చదవండి : తిరుపతి, షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే..


ఆసక్తి గల ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ www.irctctourism.com లేదా IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ ఆఫీస్‌లు, రీజినల్ ఆఫీస్‌లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ గురించి మరింత సమాచారం కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=NJA06 లింక్ చెక్ చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Tourism, Travel, Travelling

ఉత్తమ కథలు