హోమ్ /వార్తలు /బిజినెస్ /

Navratri 2022: నవరాత్రుల సందర్భంగా రైల్వే ప్రయాణికులకు స్పెషల్ మెనూ.. ఫుడ్‌ ఇలా ఆర్డర్‌ చేసుకోండి..

Navratri 2022: నవరాత్రుల సందర్భంగా రైల్వే ప్రయాణికులకు స్పెషల్ మెనూ.. ఫుడ్‌ ఇలా ఆర్డర్‌ చేసుకోండి..

Photo Credit : ANI

Photo Credit : ANI

Navratri 2022: నవరాత్రుల సందర్భంగా రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ఇందుకోసం రైళ్లలో స్పెషల్ మెనూ (Special Menu) ప్రవేశపెట్టింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో నవరాత్రుల (Navratri) సందడి మొదలైంది. నవరాత్రులలో దుర్గా దేవి (Maa Durga) ఆశీర్వాదం కోసం భక్తులు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. అందుకే ఈ సమయంలో రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ఇందుకోసం రైళ్లలో స్పెషల్ మెనూ (Special Menu) ప్రవేశపెట్టింది. సాంప్రదాయాల ప్రకారం ఈ తొమ్మిది రోజుల్లో ప్రజలు సాధారణంగా కుట్టు కి పూరీ, సింఘారే కే పకోడే, సాబుదానా ఖిచ్డీ, సాబుదాన వడ వంటి ఆహారాన్ని తీసుకుంటారు. ఇలాంటి పదార్థాలతో IRCTC నవరాత్రులకు స్పెషల్ మెనూ అందిస్తోంది. ఈ ఫుడ్‌ను బుక్‌ చేసుకోవాల్సిన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* అక్టోబర్‌ 5 వరకు అందుబాటులో ప్రత్యేక మెనూ

నవరాత్రులు సందర్భంగా తీసుకొచ్చిన మెనూపై రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. ‘నవరాత్రులు పవిత్రమైన రోజులు. ప్రయాణికులు వ్రతాలు చేస్తున్న సమయంలో నియమాలు పాటించేలా IRCTC ప్రత్యేక మెనూను అందిస్తోంది.

2022 సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5 వరకు మెనూ అందుబాటులో ఉంటుంది. ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ ద్వారా రైలు ప్రయాణికులు నవరాత్రుల ప్రత్యేక ఆహార పదార్థాలను బుక్‌ చేసుకోవచ్చు. లేదా http://ecatering.irctc.co.in సైట్‌ నుంచి 1323కి కాల్ చేసి వివరాలు పొందవచ్చు.’ అని పేర్కొంది.

* IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫుడ్‌ ఇలా బుక్‌ చేసుకోండి

ముందు IRCTC eCatering అధికారిక వెబ్‌సైట్ https://www.ecatering.irctc.co.in/ను ఓపెన్‌ చేయాలి. అనంతరం పది-అంకెల PNR నంబర్‌ను ఎంటర్‌ చేసి కంటిన్యూ చేయడానికి రైట్‌ యారోపై క్లిక్‌ చేయాలి. అక్కడ అందుబాటులో ఉన్న కేఫ్‌లు, అవుట్‌లెట్‌లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్‌ల లిస్ట్‌ కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి : అక్టోబర్‌లో బ్యాంకులకు 9 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

అందులో నుంచి అవసరమైన ఆహార పదార్థాలను సెలక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పేమెంట్‌ మోడ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ పే చేయవచ్చు లేదా క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకోవచ్చు. ఆర్డర్‌ కంప్లీట్‌ అయిన తర్వాత సీటు/బెర్త్‌ వద్దకు ఫుడ్‌ డెలివరీ అవుతుంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు టిక్కెట్లపై ప్రత్యేక నవరాత్రి థాలీని బుక్ చేసుకోవచ్చు.

* స్టార్టర్స్‌, మెయిన్‌ కోర్స్‌, డెజర్ట్స్‌

IRCTC కొత్త మెనూని రూ.99 ప్రారంభ ధరకే అందిస్తోంది. సాధారణ టేబుల్ సాల్ట్‌కు బదులుగా సెందా నమక్‌తో తయారు చేసిన స్టార్టర్లను అందిస్తారు. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఫుడ్‌ ఉంటుంది. ఈ స్టార్టర్స్ మెనూలో ఆలూ చాప్, సాబుదానా టిక్కీ ఉంటాయి. మెయిన్‌ కోర్సులో పనీర్ మఖ్మాలి, సాబుదానా ఖిచ్డీ, కోఫ్తా కర్రీ, పనీర్ మఖ్మాలి, పరాఠాలు ఉంటాయి. IRCTC సీతాఫల్ ఖీర్‌ను వంటి డెజర్ట్‌లను కూడా ప్రత్యేకంగా అందిస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Navaratri

ఉత్తమ కథలు