హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: ఐఆర్‌సీటీసీ స్పెషల్ గుజరాత్ టూర్ ప్లాన్.. ప్యాకేజీ వివరాలివే.. ఈ టూర్ లో ప్రధాన ఆకర్షణ అదే..

IRCTC: ఐఆర్‌సీటీసీ స్పెషల్ గుజరాత్ టూర్ ప్లాన్.. ప్యాకేజీ వివరాలివే.. ఈ టూర్ లో ప్రధాన ఆకర్షణ అదే..

Statue Of Unity

Statue Of Unity

IRCTC: గుజరాత్‌లోని పర్యాటక ప్రాంతాలను తక్కువ ధరలోనే సందర్శించే అవకాశం కల్పించింది IRCTC. తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో ‘సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీ’ వివరాలను పోస్ట్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

వైవిధ్యమైన సంస్కృతులకు, ఆచారాలకు, కళలకు పుట్టినిల్లు భారతదేశం (India). ప్రతి ప్రాంతానికి విభిన్నమైన ఆకర్షణ, ప్రత్యేకత ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లోని జీవన విధానాలను, ఆచారాలను తెలుసుకుంటే భారతదేశం ఆత్మను అర్థం చేసుకున్నట్లు భావించవచ్చు. అందుకే చాలా మంది వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లడంతో పాటు స్థానికులు జరుపుకునే పండుగలు, వేడుకలను చూడాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఫెస్టివల్ సీజన్లో IRCTC స్పెషల్ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎన్నో ప్రకృతి అందాలు, విభిన్నమైన కట్టడాలు, చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమైన గుజరాత్‌(Gujarat)ను తక్కువ ధరలోనే సందర్శించే అవకాశం కల్పించింది. IRCTC తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో ‘సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీ(Saurashtra With Statue Of Unity Tour Package)’ వివరాలను పోస్ట్ చేసింది.

* స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ప్రధాన ఆకర్షణ

అద్భుతమైన గుజరాత్ రాష్ట్రాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలని ప్లాన్‌ చేస్తున్న టూరిస్టులకు IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీ ద్వారా గుజరాత్‌లోని కొన్ని ప్రధాన నగరాలను అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ముఖ్యంగా స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ సందర్శన టూర్ హైలెట్‌గా చెప్పవచ్చు. IRCTC గుజరాత్ టూర్ ప్యాకేజీ మొత్తం 6 రాత్రులు, 7 రోజులు కొనసాగుతుంది.

* హైదరాబాద్‌ నుంచి ప్రారంభం

సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ టూర్ అక్టోబరు 29న హైదరాబాద్‌ నుంచి టూర్‌ ప్రారంభం కానుంది. పర్యాటకులు హైదరాబాద్‌ నుంచి విమానంలో ప్రయాణించనున్నారు. ఈ ప్యాకేజీ బుకింగ్ ఫస్ట్‌-ఇన్‌-ఫస్ట్‌-సెర్వ్‌డ్‌ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ముందుగా వచ్చిన వారికే అవకాశం ఉంటుంది. IRCTC తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో సౌరాష్ట్ర, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీ గురించి ట్వీట్ చేసింది.

* ఖర్చు ఎంత?

తాజా టూర్ ప్యాకేజీలో ఒక్క టూరిస్ట్‌కు రూ.38,350 ఖర్చు అవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కో వ్యక్తికి రూ.29,650 వర్తిస్తుంది. బృందంగా టూర్‌కు వెళుతుంటే, మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉంటే, ఒక్కొక్కరికి రూ.28,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ టూర్‌ ప్యాకేజీకి సంబంధించి మరింత సమాచారం కోసం, IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ను సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి : ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసు వచ్చిందా..? అయితే, ఏం చేయాలో తెలుసుకోండి..

* స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ప్రత్యేకతలు ఇవే

182 మీటర్ల ఎత్తు ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇది చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం కంటే 29 మీటర్లు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లిబర్టీ విగ్రహం కంటే 89 మీటర్లు ఎత్తు ఉంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పునాది ఎత్తు 58 మీటర్లు. లార్సెన్ & టూబ్రో (L&T)కి చెందిన 300 మంది ఇంజినీర్లు, 3,000 మంది కార్మికులు మూడున్నర సంవత్సరాలలో విగ్రహాన్ని నిర్మించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ స్టాచ్యూను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Gujarat, IRCTC, IRCTC Tourism, Statue of Unity

ఉత్తమ కథలు