హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: ఐఆర్‌సీటీసీ పది రోజుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. అయోధ్య, వారణాసితో పాటు నేపాల్‌లో పర్యటన..!

IRCTC: ఐఆర్‌సీటీసీ పది రోజుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. అయోధ్య, వారణాసితో పాటు నేపాల్‌లో పర్యటన..!

IRCTC: ఐఆర్‌సీటీసీ పది రోజుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. అయోధ్య, వారణాసితో పాటు నేపాల్‌లో పర్యటన..!

IRCTC: ఐఆర్‌సీటీసీ పది రోజుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. అయోధ్య, వారణాసితో పాటు నేపాల్‌లో పర్యటన..!

IRCTC: పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకునే యాత్రికుల కోసం భారత్-నేపాల్ అష్టయాత్ర పేరుతో ఒక టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. యాత్రికులు పది రోజుల యాత్రలో ఉత్తర భారతంలోని పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటు నేపాల్‌లో కూడా పర్యటించవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారతదేశంలో పండుగల సీజన్ (Festive Season) ఘనంగా ప్రారంభమైంది. దసరా, దీపావళి నుంచి కొత్త సంవత్సరం, సంక్రాంతి వరకు ఈ సందడి కొనసాగుతుంది. ఈ సమయంలో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి యాత్రికులు భారీ సంఖ్యలో వెళుతుంటారు. ఈ క్రమంలో రైళ్లలో టూర్లకు వెళ్లే యాత్రికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇటీవల స్పెషల్ టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకునే యాత్రికుల కోసం భారత్-నేపాల్ అష్టయాత్ర (Bharat Nepal Ashtayatra) పేరుతో ఒక టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. యాత్రికులు పది రోజుల యాత్రలో ఉత్తర భారతంలోని పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటు నేపాల్‌లో కూడా పర్యటించవచ్చు.

* యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?

భారత్-నేపాల్ అష్టయాత్ర అక్టోబర్ 28న, ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణికులు భారత్ గౌరవ్ టూరిస్ట్స్ ట్రైన్, 3AC క్లాస్‌లో ప్రయాణిస్తారు. ఢిల్లీ, ఘజియాబాద్, తుండ్లా, కాన్పూర్ రైల్వే స్టేషన్‌‌తో పాటు మరికొన్ని స్టేషన్లలో బోర్డింగ్, డి-బోర్డింగ్‌ సౌకర్యం ఉంది. మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లుగా ఉంటే ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో.. డబుల్ లేదా ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 34650 ఖర్చవుతుంది. ఇక కంఫర్ట్ కేటగిరి కింద సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 39850 చెల్లించాల్సి ఉంటుంది.

* టూర్‌లో కవర్ అయ్యే పుణ్యక్షేత్రాలు

భారత్‌లోని అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రాంతాలను ఈ టూర్ కవర్ చేస్తుంది. రామ జన్మభూమి మందిరం, హనుమాన్ గర్హి, సరయూ ఘాట్, తులసి మానస్ ఆలయం, సంకట్ మోచన్ ఆలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్, గంగా హారతి, గంగా- యమునా సంగమం, హనుమాన్ దేవాలయం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. అలాగే నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌లోని ప్రసిద్ధ పశుపతి‌నాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, స్వయంభూనాథ్ స్థూపాన్ని కూడా సందర్శించవచ్చు.

టూర్ మొత్తం ఛార్జీలో రైలు ప్రయాణం, రాత్రిపూట హోటళ్లలో బస, రైలులో భోజనం (వెజ్), వివిధ ప్రాంతాల నుంచి ట్రాన్స్‌ఫర్స్, ప్రయాణ బీమా, భద్రతా ఛార్జీలు, పన్నులు వంటివి కలిసి ఉంటాయి. అయితే ప్రయాణికుల సాహసోపేతమైన యాక్టివిటీస్, మాన్యుమెంట్(స్మారక) ఛార్జీలు, ప్రయాణికులు కోరుకునే భోజనం, రూమ్ సర్వీస్, వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన ఖర్చులు యాత్ర ఛార్జీల్లో కవర్ కావు.

* టూర్ షెడ్యూల్

ప్యాకేజీ పేరు- భారత్ నేపాల్ అష్ట యాత్ర (NZBG07)

డెస్టినేషన్ కవర్ - అయోధ్య, ఖాట్మండు, వారణాసి, ప్రయాగ్‌రాజ్

పర్యటన ప్రారంభ తేదీ -అక్టోబర్ 28, 2022

పర్యటన వ్యవధి - 10 పగళ్లు/9 రాత్రులు

మీల్ ప్లాన్ - టిఫిన్, లంచ్ & డిన్నర్

ట్రావెల్ మోడ్ - రైలు

* బుకింగ్ ఇలా

టిక్కెట్ల బుకింగ్ కోసం ప్రయాణీకులు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లు, జోనల్ ఆఫీసులు, ప్రాంతీయ ఆఫీస్‌‌ల్లో కూడా బుకింగ్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ సౌకర్యాలు కల్పించింది.

* ఇవి తప్పనిసరి

ఆలయాలు, స్మారక చిహ్నాల సందర్శన కోసం ప్రయాణికులు తమ కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఈ సర్టిఫికేట్‌ను సాఫ్ట్ లేదా హార్డ్ కాపీలలో సమర్పించవచ్చు. అయితే ఓటరు ఐడీ లేదా ఆధార్ కార్డుకు సంబంధించి హార్డ్ కాపీని తీసుకెళ్లడం తప్పనిసరి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Ayodhya Ram Mandir, IRCTC, IRCTC Tourism, Nepal, Travelling

ఉత్తమ కథలు