• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • IRCTC IMUDRA APP OFFERS UP TO RS 2000 CASHBACK ON TRANSACTIONS ABOVE RS 5000 KNOW HOW TO AVAIL SS

IRCTC iMudra App: ఐఆర్‌సీటీసీ నుంచి రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్... ఎలా పొందాలో తెలుసుకోండి

IRCTC iMudra App: ఐఆర్‌సీటీసీ నుంచి రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్... ఎలా పొందాలో తెలుసుకోండి

IRCTC iMudra App: ఐఆర్‌సీటీసీ నుంచి రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్... ఎలా పొందాలో తెలుసుకోండి (image: Playstore)

IRCTC iMudra App | ఐఆర్‌సీటీసీ ఐముద్ర యాప్‌ ద్వారా లావాదేవీలు జరిపి రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    మీరు ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారా? డిజిటల్ వ్యాలెట్స్ ద్వారా పేమెంట్స్ చేస్తుంటారా? ఇలాంటి పేమెంట్స్‌కు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం లభిస్తే ఎవరూ ఆ ఛాన్స్ వదులుకోరు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఐముద్ర యాప్‌ జారీ చేసిన కార్డుల ద్వారా ద్వారా జరిపే లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రూ.5,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేసేవారికి రూ.2,000 క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. iMudra ఐఆర్‌సీటీసీకి చెందిన పేమెంట్ యాప్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఐముద్ర యాప్‌ లేదా డిజిటల్ కార్డుతో పేమెంట్స్ చేయొచ్చు. గరిష్టంగా రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. క్యాష్‌బ్యాక్ 30 వర్కింగ్ డేస్‌లో క్రెడిట్ అవుతుంది.

    ఐముద్ర యాప్ ద్వారా జారీ చేసిన వీసా, రూపే కార్డుల ద్వారా పేమెంట్స్ చేసేవారికి రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. డిజిటల్, ఫిజికల్ ట్రాన్సాక్షన్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌పై ఐముద్ర యాప్‌‌తో పేమెంట్ చేయొచ్చు. 2021 ఫిబ్రవరి 28 లోగా రూ.5,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctcimudra.com/ వెబ్‌సైట్స్‌లో ఆఫర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.

    Bank of Baroda: విజయా, దేనా బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు అలర్ట్... మార్చి 1న మారే రూల్స్ ఇవే

    Phone Calls: అలర్ట్... కాల్స్ ఎక్కువ చేస్తున్నారా? డేటా ఎక్కువ వాడుతున్నారా? ఏప్రిల్ 1 నుంచి షాకే


    కస్టమర్లు ఐముద్ర యాప్ డౌన్‌లోడ్ చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఐముద్ర డిజిటల్ కార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐముద్ర యాప్‌ జారీ చేసిన వీసా, రూపే కార్డులతో పేమెంట్స్ చేయొచ్చు. ఐముద్ర వ్యాలెట్‌లో డెబిట్ కార్డ్, యూపీఐ, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు లోడ్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ ఫెడరల్ బ్యాంక్ సహకారంతో ఐముద్ర యాప్‌ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు