Railways | ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ - IRCTC ), ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక కలిసి కొత్త క్రెడిట్ కార్డు తీసుకువచ్చాయి. కొత్త కో బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డును (Credit Card) ఆవిష్కరించాయి. ఎన్‌పీసీఐ రూపే నెట్‌వర్క్‌లో ఈ కార్డును తీసుకువచ్చారు. ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ పొందొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐఆర్‌సీటీసీ పేర్కొంటున్నాయి. అలాగే ఎక్కువ ఆదా చేసుకోవచ్చని పేర్కొంటున్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా లేదంటే ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా ఈ క్రెడిట్ కార్డు ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే ప్రయోజనం పొందొచ్చని తెలియజేస్తున్నాయి.
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. భారీ తగ్గింపు పొందండిలా!
అంతేకాకుండా ఐఆర్‌సీటీసీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లు జాయినింగ్ బోనస్ పొందొచ్చు. బుకింగ్స్‌పై డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్ యాక్సెస్ ఉచితంగా పొందొచ్చు. క్రెడిట్ కార్డు తీసుకునే వారికి జాయినింగ్ బెనిఫిట్ కింద రూ. 500 అమెజాన్ వోచర్ వస్తుంది. ప్రతి రూ. 100 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లు పొందొచ్చు. ట్రైన్ టికెట్ బుకింగ్‌కు ఇది వర్తిస్తుంది. స్మార్ట్ బై ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇతర కొనుగోళ్లపై రూ. 100 ఖర్చుపై ఒక రివార్డు పాయింటు వస్తుంది.
భారీగా పడిపోతున్న బంగారం ధరలు .. 2 నెలల కనిష్టానికి గోల్డ్ రేటు!
ఏడాదికి 8 కాంప్లిమెంటరీ ఐఆర్‌సీటీసీ రైల్వే లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. ఏసీ టికెట్ బుకింగ్‌పై అదనపు రివార్డు పాయింట్లు పొందొచ్చు. అలాగే కార్డు యాక్టివేషన్ ద్వరా 500 వెల్‌కమ్ గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. కార్డు పొందిన 90 రోజులలోగా రూ. 30 వేలు ఖర్చు చేస్తే.. రూ. 500 గిఫ్ట్ వోచర్ వస్తుంది. ఇకాం ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌పై ఒక శాతం ట్రాన్సాక్షన్ చార్జీలు మాఫీ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డు పొందాలని భావించే వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
నెలవారీ జీతం రూ. 25 వేల కన్నా ఎక్కువగా ఉండాలి. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు చార్జీల విషయానికి వస్తే.. జాయినింగ్, యాన్వల్ ఫీజు రూ. 500గా ఉంది. ఏడాదిలో కార్డు ద్వారా రూ. 1.5 లక్షలు ఖర్చు చేస్తే.. ఈ ఫీజు మాఫీ చేస్తారు. అంటే అప్పుడు ఉచితంగానే కార్డు పొందినట్లు అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hdfc, HDFC bank, Indian Railways, IRCTC, Railways