IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ

IRCTC | ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లాంటి వివరాలు కూడా ఎవరికీ వెల్లడించకూడదు. మీరు రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఇప్పిస్తామని ఎవరైనా మీ వివరాలు అడిగినా చెప్పకూడదు.

news18-telugu
Updated: August 8, 2019, 1:17 PM IST
IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ
IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ
news18-telugu
Updated: August 8, 2019, 1:17 PM IST
IRCTC... ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ప్రయాణికులకు రైలు టికెట్ బుకింగ్ సేవల దగ్గర్నుంచి కేటరింగ్, టూర్ సర్వీసుల్ని అందించే సంస్థ. నిత్యం లక్షలాది మంది ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్, వెబ్‌సైట్ల ద్వారా రైలు టికెట్లు బుక్ చేస్తుంటారు. ఇతర సేవలు పొందుతుంటారు. అయితే ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్త అని హెచ్చరిస్తోంది ఐఆర్‌సీటీసీ. అప్రమత్తంగా లేకపోతే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోవాల్సి వస్తోందని వార్నింగ్ ఇస్తోంది. మరి టికెట్ బుకింగ్‌తో పాటు ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్, వెబ్‌సైట్లలో లావాదేవీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐఆర్‌సీటీసీ ఇస్తున్న సూచనలేంటో తెలుసుకోండి.

1. అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డ్, పిన్, టీపిన్, సీవీవీ, యూపీఐ వివరాలు ఎవరికీ వెల్లడించొద్దు.
2. ఫోన్, ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా ఎవరైనా ఈ సమాచారాన్ని అడిగితే తిరస్కరించండి.

3. కాల్ చేసిన వ్యక్తులు తాము ఫలానా అధికారులమని చెప్పినా నమ్మొద్దు. ఎలాంటి వివరాలు వెల్లడించొద్దు.
4. మీ బ్యాంకు వివరాలు వెల్లడిస్తే మోసపోయే ప్రమాదం ఉంది.


5. మీ ఖాతా వివరాలు చెప్పాలంటూ ఐఆర్‌సీటీసీ నుంచి ఎలాంటి కాల్స్ రావన్న విషయం గుర్తుంచుకోండి.
6. ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లాంటి వివరాలు కూడా ఎవరికీ వెల్లడించకూడదు.
Loading...
7. మీరు రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఇప్పిస్తామని ఎవరైనా మీ వివరాలు అడిగినా చెప్పకూడదు.
8. రీఫండ్, టీడీఆర్ లాంటివి ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా జరిగిపోతాయి. ఇందులో వ్యక్తుల ప్రమేయం ఉండదు.
9. రీఫండ్, టీడీఆర్ లాంటి వాటిలో ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా ఐఆర్‌సీటీసీ కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలి.
10. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఉన్న నెంబర్లకే కాల్ చేయాలి. గూగుల్‌తో పాటు ఇతర సెర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఐఆర్‌సీటీసీ పేరుతో ఉండే నెంబర్లకు కాల్ చేయకూడదు.
11. మీ రైలు బుకింగ్ లేదా క్యాన్సలేషన్ వివరాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయకూడదు. ఆ వివరాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
12. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డీటైల్స్‌ని ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు ఎవరూ అడగరు. ఎవరికీ షేర్ చేయకూడదు.

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Metz TV: రూ.17,999 ధరకే 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎంత ఉండాలో తెలుసా?
First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...