Home /News /business /

IRCTC EPAYLATER IF YOU DONT HAVE MONEY BOOK YOUR TRAIN TICKETS WITH BOOK NOW PAY LATER OPTION PAY WITHIN 14 DAYS KNOW HOW SS

IRCTC-ePayLater: డబ్బులు లేకపోయినా రైలు టికెట్ బుక్ చేసుకోండి ఇలా...

IRCTC-ePayLater: డబ్బులు లేకపోయినా రైలు టికెట్ బుక్ చేసుకోండి ఇలా...

IRCTC-ePayLater: డబ్బులు లేకపోయినా రైలు టికెట్ బుక్ చేసుకోండి ఇలా...

IRCTC Book Now Pay Later | ముందుగా ePayLater అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓటీపీ యాక్టివేషన్ కోసం ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పాన్ కార్డ్ నెంబర్ తప్పనిసరి. మీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 'బుక్ నౌ, పే లేటర్' ఆప్షన్ ఎంచుకొని టికెట్ బుక్ చేయాలి.

ఇంకా చదవండి ...
    మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా? బిజినెస్, ఆఫీసు పనుల్లో ఎక్కువగా ట్రైన్ జర్నీ చేస్తుంటారా? అయితే మీరు ఐఆర్‌సీటీసీలో రెగ్యులర్‌గా టికెట్లు బుక్ చేస్తూనే ఉంటారు. అయితే మీ దగ్గర డబ్బులు లేకపోయినా టికెట్లు బుక్ చేయొచ్చు. తర్వాత డబ్బులు చెల్లించొచ్చు. ఐఆర్‌సీటీసీ అందిస్తున్న 'బుక్ నౌ, పే లేటర్' సదుపాయం ఇది. వాస్తవానికి ePayLater సంస్థతో కలిసి 2018లోనే 'బుక్ నౌ, పే లేటర్' సర్వీస్ ప్రారంభించింది ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. కానీ దీని గురించి పెద్దగా తెలియక ఉపయోగించుకున్నది తక్కువే. ఇటీవల కాలంలో ఈ సేవల్ని ఉపయోగించుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. జనవరి నుంచి మార్చి వరకు సుమారు 2.5 లక్షల మంది ఐఆర్‌సీటీసీ కస్టమర్లు 'బుక్ నౌ, పే లేటర్' ఫీచర్‌ను వాడుకున్నారని అంచనా. ePayLater సంస్థ కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన స్టార్టప్.

    Read this: Indian Railways: మీరు ఎక్కిన రైలు డర్టీగా ఉందా? ఇలా కంప్లైంట్ చేయండి

    IRCTC-ePayLater: 'బుక్ నౌ, పే లేటర్' ఎలా పనిచేస్తుంది?


    సడెన్‌గా జర్నీ ప్లాన్ చేసుకునేవాళ్లకు 'బుక్ నౌ, పే లేటర్' సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది. వెంటనే టికెట్ బుక్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు చేతిలో డబ్బులు లేకపోయినా ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు లేకపోతే టికెట్ బుక్ చేసుకునే సమయంలో 'బుక్ నౌ, పే లేటర్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందుకోసం మీరు ముందుగా ePayLater అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓటీపీ యాక్టివేషన్ కోసం ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పాన్ కార్డ్ నెంబర్ తప్పనిసరి. మీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 'బుక్ నౌ, పే లేటర్' ఆప్షన్ ఎంచుకొని టికెట్ బుక్ చేయాలి. ePayLater వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ePayLater ఐడీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. మీ తరఫున ePayLater డబ్బులు చెల్లిస్తుంది. మీకు టికెట్ లభిస్తుంది. టికెట్ బుక్ చేసిన 14 రోజుల లోపు మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 3.5%+పన్నులను అదనంగా చెల్లించాలి. ఆ తర్వాత వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

    Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

    ఇవి కూడా చదవండి:

    SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

    SBI New Rules: మే 1 నుంచి ఎస్‌బీఐలో మారనున్న రూల్స్ ఇవే...

    Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2 రిలీజ్... ధర రూ.5,999
    First published:

    Tags: E-wallet, Indian Railways, Irctc, Railways, Train

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు