IRCTC E-Wallet: ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో ఇలా రిజిస్టర్ చేసుకోవాలి

IRCTC E-Wallet | ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో కనీసం రూ.100 డిపాజిట్ చేయాలి. ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో గరిష్టంగా రూ.10,000 వరకు జమ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: April 9, 2019, 12:36 PM IST
IRCTC E-Wallet: ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో ఇలా రిజిస్టర్ చేసుకోవాలి
IRCTC E-Wallet: ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో ఇలా రిజిస్టర్ చేసుకోవాలి
news18-telugu
Updated: April 9, 2019, 12:36 PM IST
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్- IRCTC ఇ-టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇ-వ్యాలెట్ సర్వీస్ అందిస్తోంది. ఈ సర్వీస్ కింద మీరు ముందుగానే ఇ-వ్యాలెట్‌లో డబ్బులు జమ చేయొచ్చు. ఆ తర్వాత టికెట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ యూజర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. పాన్ లేదా ఆధార్ నెంబర్‌తో ధృవీకరణ తప్పనిసరి. ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్ సర్వీస్‌కు రిజిస్టర్ చేసుకుంటే అనేక ఉపయోగాలున్నాయి. ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్ సర్వీస్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్ సర్వీస్‌ రిజిస్టర్ చేసుకోండిలా...


ముందుగా మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి

ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్ సెక్షన్‌లో 'IRCTC e-wallet Registration' లింక్ పైన క్లిక్ చేయాలి.
మీ పాన్ లేదా ఆధార్ నెంబర్‌‌తో వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.


రూ.10 కన్నా ఎక్కువ సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి.
ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో కనీసం రూ.100 డిపాజిట్ చేయాలి.
ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో గరిష్టంగా రూ.10,000 వరకు జమ చేసుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో ఉన్న డబ్బుతో మీరు టికెట్లు బుక్ చేయొచ్చు.
ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌ ద్వారా కొన్న టికెట్లు క్యాన్సిల్ చేస్తే మరుసటి రోజు ఇ-వ్యాలెట్‌లోకి డబ్బులు జమ అవుతాయి.

Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

JIO Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రూ.200 లోపు జియో ప్లాన్స్ ఇవే...

Honor Gala Festival: హానర్ గాలా ఫెస్టివల్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

Realme Backpack: రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్ ఒక్క రూపాయికే... ఇలా కొనాలి
First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...