IRCTC E TICKET WANT TO CHANGE PASSENGER NAME IN TRAIN TICKET OR TRANSFER TICKET TO YOUR FAMILY MEMBER HERE IS THE PROCESS SS
IRCTC E-Ticket: రైలు టికెట్‌పై పేరు మార్చుకోవచ్చు ఇలా...
Railway New Rules: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...
IRCTC E-Ticket Nme Change | పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకున్న టికెట్లకు ఏ నిబంధనలు ఉంటాయో ఇ-టికెట్‌కూ అవే నిబంధనలు వర్తిస్తాయి. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు సదరు ప్యాసింజర్ సమీపంలోని రైల్వే రిజర్వేషన్ ఆఫీసులో రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి.
మీరు రైల్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీ జర్నీ ప్లాన్ మారిందా? మీరు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా మరొకరికి బదిలీ చేయాలనుకుంటున్నారా? ఇది సాధ్యమే. ఇ-టికెట్‌పై ప్యాసింజర్ పేరు మార్చుకునే అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఇందుకోసం మీరు రైల్వే రిజర్వేషన్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. 'ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్' ప్రింట్ అవుట్ తప్పనిసరి. దాంతో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ కూడా ఉండాలి. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే రేల్వే ఆఫీసుకు వెళ్లాలి. రైలు టికెట్‌పై పేరు మార్చుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి.
రైల్వే రిజర్వేషన్ ఆఫీసుల్లో రైలు టికెట్‌పై పేరు మార్చడంతో పాటు బోర్డింగ్ స్టేషన్ కూడా మార్చొచ్చు. పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకున్న టికెట్లకు ఏ నిబంధనలు ఉంటాయో ఇ-టికెట్‌కూ అవే నిబంధనలు వర్తిస్తాయి. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు సదరు ప్యాసింజర్ సమీపంలోని రైల్వే రిజర్వేషన్ ఆఫీసులో రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ప్యాసింజర్ కుటుంబానికి మాత్రమే ఇ-టికెట్‌ను బదిలీ చేస్తారు. కుటుంబం అంటే తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కూతురు, భర్త, భార్య మాత్రమే. మిగతా ఎవరికీ టికెట్లను బదలాయించదు ఐఆర్సీటీసీ.
మీరు మీ రైలు టికెట్‌ను మీ కుటుంబ సభ్యులకు బదిలీ చేయాలనుకుంటే 'ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్' ప్రింట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్ తీసుకెళ్లాలి. ఎవరి పేరుకు బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాసింజర్‌కు మీకు ఉన్న సంబంధాన్ని ధృవీకరించే ప్రూఫ్ ఏదైనా ఉండాలి.
Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.