భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సేవలు ఫిబ్రవరి 1న ప్రారంభం కానున్నాయని భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించింది. 2020 మార్చి 22 నుంచి ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సేవలు మళ్లీ ప్రారంభం కాలేదు. భారతీయ రైల్వే లాక్డౌన్ తర్వాత దశలవారీగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నా ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సర్వీస్ ప్రారంభం కాలేదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఆంక్షల్ని సడలిస్తూ కొత్త గైడ్‌లైన్స్ విడుదలవుతుండటంతో ఇ-కేటరింగ్ మళ్లీ ప్రారంభించేందుకు ఐఆర్సీటీసీ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 1న ఇ-కేటరింగ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సర్వీస్ ప్రారంభమైతే ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి తమ బెర్తుకే తెప్పించుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ వెబ్సైట్ https://www.ecatering.irctc.co.in/ లేదా 1323 నెంబర్ ద్వారా ఆర్డర్స్ చేయొచ్చు. ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ యాప్ అయిన 'Food on Track' యాప్ కూడా ఉపయోగించొచ్చు.
ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సేవలు దేశవ్యాప్తంగా మొత్తం ఒకేసారి కాకుండా దశలవారీగా ప్రారంభించే ఆలోచనలో ఉంది ఐఆర్సీటీసీ. ముందుగా రెడీ టు ఈట్ మీల్స్ మాత్రమే అందించనుంది. అది కూడా మొదట 30 రైల్వే స్టేషన్లలో ఇ-కేటరింగ్ సర్వీస్ ప్రారంభించి 250 రైళ్లకు మాత్రమే కేటరింగ్ సేవల్ని అందించనుంది. కోవిడ్ 19 గైడ్‌లైన్స్ ఉండటంతో ప్రయాణికులకు మీల్స్ అందించే ఇ-కేటరింగ్ పార్ట్నర్స్ హెల్త్, హైజీన్ ప్రోటోకాల్స్ పాటించాలని ఐఆర్సీటీసీ సూచించింది. ప్రయాణికులు గతంలోలాగానే తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. 'Food on Track' యాప్ లేదా https://www.ecatering.irctc.co.in/ వెబ్సైట్లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
Indian Railways: రైలు ప్రయాణికుల ప్రైవసీ కోసం ప్రత్యేక కిటికీలు... ఎలా ఉంటాయంటే
Indian Railways to resume e-catering services from 1st February.
This will further enhance travel experience and passenger convenience as they can enjoy their favourite & fresh food during train journeys.
? https://t.co/2VKXZEXpzE pic.twitter.com/Hdf2jo7YUL
— Ministry of Railways (@RailMinIndia) January 28, 2021
ప్రయాణికులు ముందుగా 'Food on Track' యాప్ లేదా https://www.ecatering.irctc.co.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
రైలు టికెట్‌పై ఉండే పీఎన్ఆర్ ఎంటర్ చేయాలి.
దారిలో ఉన్న రైల్వే స్టేషన్ల వివరాలు కనిపిస్తాయి.
మీకు ఏ రైల్వే స్టేషన్లు ఫుడ్ కావాలో సెలెక్ట్ చేయాలి.
రైల్వే స్టేషన్‌ను ఎంచుకున్న తర్వాత ఆ రైల్వే స్టేషన్ పరిధిలో కేటరింగ్ సేవల్ని అందించే రెస్టారెంట్ల పేర్లు కనిపిస్తాయి.
ఆ లిస్ట్‌లో నుంచి ముందుగా రెస్టారెంట్ సెలెక్ట్ చేయాలి.
ఆ రెస్టారెంట్లో లభించే ఫుడ్ ఐటమ్స్ వివరాలు కనిపిస్తాయి.
అందులో ఫుడ్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాలి. లేదా క్యాష్ ఆన్ డెలివరీ చేయొచ్చు.
ఆర్డర్ చేసేముందు వివరాలన్నీ ఓసారి సరిచూసుకోవాలి.
మీరు ఎంచుకున్న రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే ఫుడ్ పార్శిల్ మీ బెర్తు దగ్గరకు వస్తుంది.
Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో 2 నిమిషాల్లో తెలుసుకోండిలా
PM Kisan Scheme: ఈ చిన్న మిస్టేక్‌తో మీ అకౌంట్లోకి రూ.6000 రావు... సరిదిద్దుకోండి ఇలా
ఐఆర్సీటీసీ 2014లో ఇ-కేటరింగ్ సర్వీస్ ప్రారంభించింది. ప్రయాణికులు ఐఆర్సీటీసీ క్యాంటీన్లతో పాటు స్థానికంగా ఉండే హోటళ్ల నుంచి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి తమ బెర్తుకు తెప్పించుకోవడానికి ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ ఉపయోగపడుతుంది. కోవిడ్ 19 కన్నా ముందు ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సర్వీస్‌కు రోజూ 20,000 పైగా ఆర్డర్లు వచ్చేవి. మళ్లీ ఇదే స్థాయిలో ఆర్డర్లు రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food, Food delivery, Indian Railway, Indian Railways, IRCTC, Online food delivery, Railways, Train, Train tickets