IRCTC e-catering app: రైల్లోనే పిజ్జా, బిర్యానీ ఆర్డర్ చేయొచ్చు... ఎలాగో తెలుసుకోండి

IRCTC e-catering app | 500 పైగా రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు. మొఘలాయి బిర్యానీ నుంచి పిజ్జాల వరకు మీరు ఏం కావాలంటే ఆ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.

news18-telugu
Updated: April 7, 2019, 12:35 PM IST
IRCTC e-catering app: రైల్లోనే పిజ్జా, బిర్యానీ ఆర్డర్ చేయొచ్చు... ఎలాగో తెలుసుకోండి
IRCTC e-catering app: రైల్లోనే పిజ్జా, బిర్యానీ ఆర్డర్ చేయొచ్చు... ఎలాగో తెలుసుకోండి
news18-telugu
Updated: April 7, 2019, 12:35 PM IST
మీరు రైలులో లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకున్నారా? రైలులో అమ్మే ఫుడ్ తినాలంటే భయంగా ఉందా? అయితే మీ కోసమే ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ సర్వీస్ అందిస్తోంది. మీరు రైలులో ప్రయాణిస్తూనే మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ యాప్ లేదా www.ecatering.irctc.co.in వెబ్‌సైట్‌లో, ఆఫ్‌లైన్‌లో అయితే 1323 నెంబర్‌కు కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు. ముంబై సెంట్రల్(BCT), ఛత్రపతి శివాజీ టెర్మినల్(CST), న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్(NDLS), ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్(DEL), బెంగళూరు సిటీ జంక్షన్(SBC), చెన్నై సెంట్రల్(MAS), కాన్పూర్(CNB), అల్లాహాబాద్ జంక్షన్(ALD), వారణాసి(BSB), లక్నో(LKO), ఇటారసి(ET), భోపాల్ జంక్షన్(BPL), విజయవాడ(BZA) స్టేషన్లను ఎంచుకొని మీ ఫుడ్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.


IRCTC e-catering: ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలి?




ముందుగా www.ecatering.irctc.co.in వెబ్‌సైట్ లేదా e-catering యాప్ ఓపెన్ చేయండి.
పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయండి.
మీకు ఫుడ్ డెలివరీ కావాల్సిన రైల్వే స్టేషన్ ఎంచుకోండి.
లిస్ట్‌లో ఉన్న రెస్టారెంట్‌ను ఎంచుకోండి.
ఆ రెస్టారెంట్‌లో ఉన్న మెనూ నుంచి మీకు కావాల్సిన ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి.
క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఆన్‌లైన్ పేమెంట్ ఎంచుకోవచ్చు.
చివరగా కన్‌ఫామ్ చేస్తే మీ ఆర్డర్ ప్లేస్ అవుతుంది.

IRCTC e-catering app, IRCTC e-catering website, e-catering, irctc e catering coupon code, food order in train, khana in train, irctc food rate, food delivery in train, food in train, ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ యాప్, ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ, ఇ-క్యాటరింగ్, ఫుడ్ ఆర్డర్, రైలులో ఫుడ్ ఆర్డర్
(image: Playstore)


500 పైగా రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు. మొఘలాయి బిర్యానీ నుంచి పిజ్జాల వరకు మీరు ఏం కావాలంటే ఆ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. మీ దగ్గర రిజర్వేషన్ టికెట్ ఉంటే చాలు. ఇ-క్యాటరింగ్ సర్వీసెస్ అన్ని రైళ్లకు వర్తిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మీరు ఫుడ్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. మీ బెర్త్ దగ్గరకే పార్శిల్ వస్తుంది. ఒకవేళ రైలు మీ ఫుడ్ డెలివరీ స్టేషన్‌కు ఆలస్యంగా వస్తే మాత్రం అందుకు ఐఆర్‌సీటీసీ బాధ్యత వహించదు.

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

ఇవి కూడా చదవండి:

IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

Realme Discount: రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ధర రూ.9,999 మాత్రమే

IGNOU Jobs: 34 ఖాళీలు... రూ.50,000 వరకు జీతం... ఏప్రిల్ 7 చివరి తేదీ
First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...