హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: రైలు ప్రయాణాలు చేస్తున్నారా.. టికెట్ బుకింగ్‌లో త్వ‌ర‌లో కీల‌క మార్పులు

IRCTC: రైలు ప్రయాణాలు చేస్తున్నారా.. టికెట్ బుకింగ్‌లో త్వ‌ర‌లో కీల‌క మార్పులు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను ఇండియన్ రైల్వే వారి వారి గమ్య స్థానాలకు చేర్చుతుంది. రైల్వే బుకింగ్‌కు సంబంధించి ప్రయాణికులు ముందస్తుగా సీటును రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని ఇండియన్ రైల్వే ప్రయాణికులకు కల్పించింది.

ఇంకా చదవండి ...

నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను ఇండియన్ రైల్వే (Indian Railways) వారి వారి గమ్య స్థానాలకు చేర్చుతుంది. రైల్వే బుకింగ్‌కు సంబంధించి ప్రయాణికులు ముందస్తుగా సీటును రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని ఇండియన్ రైల్వే ప్రయాణికులకు కల్పించింది. అందుకోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, యాను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ వెబ్‌సైట్‌కు సంబంధించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకుల కోసం.. టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సవరించింది. ఐఆర్‌సీటీసీ.. ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

EPFO Withdraw: ఈపీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేస్తున్నారా..? అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి


మార్పులు ఏమిటీ..

- ఐఆర్‌సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీలను రిజిస్ట‌ర్ చేస‌కోవాలి.

- వెరిఫికేషన్ లేకుండా కస్టమర్లు టిక్కెట్లు బుక్ చేసుకోలేరని IRCTC స్పష్టం చేసింది.

- COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చేయని వారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ లేదా యాప్‌కు వెళ్లి లాగిన్‌ కావాలి. స్టేషన్‌, తేదీ, ఇతర వివరాలను ఎంటర్‌ చేయాలి. బుక్‌ నౌ మీద క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ప్రయాణికుల వివరాలు.. ఇతర వివరాలు పొందుపర్చాలి. పేమెంట్‌ ఆప్షన్‌ పూర్తయ్యాక.. అప్పుడు కన్ఫర్మేషన్‌ వివరాలు వస్తాయి.

Cyber Security: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త.. ఇలా చేస్తే మీ డ‌బ్బులు మాయం


మొబైల్, మెయిల్ రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్‌..

- ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదంటే వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ వెరిఫికేషన్‌ విండో ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.

- అక్క‌డ మొబైల్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేయాలి.

- కుడి వైపు వెరిఫికేషన్‌.. ఎడమ వైపు ఎడిట్‌ బటన్‌ కనిపిస్తాయి.

- వివరాలు అందించాక ఓటీపీ మొబైల్‌ నెంబర్‌ లేదంటే మెయిల్‌ ఐడీకి వస్తుంది.

- ఆపై వెరిఫై ద్వారా ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

త‌క్కు ఖ‌ర్చుతో ప్యాకేజీలు

హైదరాబాద్ నుంచి టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి తిరుమల, ఊటీ, షిరిడీ, కర్నాటక లాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. రూ.12,000 లోపే ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

1. IRCTC Govindam Tour: ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,690. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

2. IRCTC Poorva Sandhya Tour: ఐ ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు కవర్ అవుతాయి. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.4,930. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

Summer Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్‌.. కాచిగూడ-తిరుప‌తి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. వివ‌రాలు


3. IRCTC Shirdi Tour: ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో శనిశింగ్నాపూర్ కవర్ అవుతుంది. 1 రాత్రులు, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.9,540. ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

4. IRCTC Tirupati Balaji Darshanam: ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం మాత్రమే కవర్ అవుతుంది. 1 రాత్రులు, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,315. ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

5. IRCTC Ultimate Ooty: ఈ టూర్ ప్యాకేజీలో ఊటీ, కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,450. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

First published:

Tags: Indian Railways, IRCTC, IRCTC Tourism

ఉత్తమ కథలు