IRCTC: రైలు టికెట్‌లో 50% డిస్కౌంట్... ఇలా బుక్ చేయండి

IRCTC Discount | మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ధి, జన్ శతాబ్ధి, దురంతో రైళ్లలో అన్ని క్లాస్ టికెట్లకు 50 శాతం వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసే టికెట్ల ద్వారా కూడా ఈ తగ్గింపు పొందొచ్చు.

news18-telugu
Updated: May 16, 2019, 1:39 PM IST
IRCTC: రైలు టికెట్‌లో 50% డిస్కౌంట్... ఇలా బుక్ చేయండి
IRCTC: రైలు టికెట్‌లో 50% డిస్కౌంట్... ఇలా బుక్ చేయండి
news18-telugu
Updated: May 16, 2019, 1:39 PM IST
భారతీయ రైల్వే కొందరికి రైలు టికెట్‌లో కన్సెషన్ ఇస్తుంది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, డాక్టర్లు, క్రీడాకారులు ఇలా వేర్వేరు వర్గాలకు టికెట్‌లో డిస్కౌంట్ లభిస్తుంది. వీరిలో వృద్ధులకు టికెట్ ఫేర్‌లో 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇండియన్ రైల్వేస్ నియమనిబంధనల ప్రకారం 60 ఏళ్లు దాటిన పురుషులు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలు టికెట్ ఫేర్‌లో 50 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ధి, జన్ శతాబ్ధి, దురంతో రైళ్లలో అన్ని క్లాస్ టికెట్లకు 50 శాతం వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసే టికెట్ల ద్వారా కూడా ఈ తగ్గింపు పొందొచ్చు.

కన్సెషన్ టికెట్లు ఇలా బుక్ చేయండి


రైల్వే కౌంటర్‌లో టికెట్ తీసుకుంటున్నట్టయితే సీనియర్ సిటిజన్ కన్సెషన్ అని చెప్పాలి. వయస్సు నిర్ధారణ కోసం ఏజ్ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. ఇక రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో రిజర్వేషన్ ఫామ్‌లో సీనియర్ సిటిజన్ కన్సెషన్ టికెట్ కోసం దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకుంటే 'Option for Senior Citizen Concession' సెక్షన్‌లో 'Avail Concession' పైన క్లిక్ చేయాలి. ప్రయాణం సమయంలో వయస్సు నిర్ధారణ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి. ఒకవేళ వృద్ధులు సీనియర్ సిటిజన్ కన్సెషన్ వద్దనుకుంటే ఆ విషయాన్ని రైల్వేకు తెలపొచ్చు. దేశాభివృద్ధి కోసం కన్సెషన్ వదులుకుంటున్నట్టు 'Forgo Full Concession' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక వారికి సీనియర్ సిటిజన్ కన్సెషన్ వర్తించదు.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్




ఇవి కూడా చదవండి:

Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండి
Loading...
PAN Card: 48 గంటల్లో పాన్ కార్డ్... పొందండి ఇలా

Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? ఈ టిప్స్ మీకోసమే...
First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...