IRCTC Discount: టికెట్ బుకింగ్‌లో వృద్ధులకు మినహాయింపు... నిబంధనలు ఇవే

IRCTC concession for senior citizens | టికెట్ బుకింగ్ సమయంలో సీనియర్ సిటిజన్ల వయస్సు వివరాలు కరెక్టుగా నమోదు చేయాలి. ప్రయాణం సమయంలో వయస్సు ధృవీకరణ పత్రం(Age proof) వెంట తీసుకెళ్లాలి.

news18-telugu
Updated: February 18, 2019, 11:53 AM IST
IRCTC Discount: టికెట్ బుకింగ్‌లో వృద్ధులకు మినహాయింపు... నిబంధనలు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీతోపాటు మీ తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత వస్తున్నారా? ఒకవేళ వాళ్లు సీనియర్ సిటిజన్లు అయితే రైలు టికెట్లలో మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళల్ని సీనియర్ సిటిజన్స్‌గా పరిగణించి టికెట్ ధరల్లో కన్సెషన్ ఇస్తుంది ఐఆర్‌సీటీసీ. ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ధి, జన్ శతాబ్ధి, దురంతో రైళ్లల్లో కూడా తగ్గింపు పొందొచ్చు. పురుషులకు 40 శాతం వరకు మహిళలకు 50 శాతం వరకు టికెట్ ధరలో మినహాయింపు వర్తిస్తుంది.

Read this: Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

ఐఆర్‌సీటీసీలో సీనియర్ సిటిజన్ కన్సెషన్ ఎలా పొందాలి?


ఐఆర్‌సీటీసీ ఇ-టికెటింగ్ వెబ్‌సైట్ http://www.irctc.co.in ఓపెన్ చేసి అందులో “Avail Concession” పేజీలో “Option for Senior Citizen Concession” ఆప్షన్ ఉంటుంది. ఈ సెక్షన్‌లో సీనియర్ సిటిజన్లు మినహాయింపు పొందొచ్చు. అయితే ఇందుకోసం టికెట్ బుకింగ్ సమయంలో వయస్సు వివరాలు కరెక్టుగా నమోదు చేయాలి. ప్రయాణం సమయంలో వయస్సు ధృవీకరణ పత్రం(Age proof) వెంట తీసుకెళ్లాలి.

Read this: మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

ఫోర్‌గో సీనియర్ సిటిజన్ కన్సెషన్ అంటే ఏంటీ?


సీనియర్ సిటిజన్లు పూర్తి మినహాయింపు పొందొచ్చు. లేదా అందులో సగం మినహాయింపు పొందొచ్చు. మినహాయింపును వదులుకోవచ్చు. ఈ మూడు అవకాశాలను కల్పిస్తోంది రైల్వే. అంటే 'Avail Concession' ఎంచుకుంటే నిబంధనల ప్రకారం వృద్ధులకు రావాల్సిన మినహాయింపు లభిస్తుంది. 'Forgo 50% Concession' ఎంచుకుంటే నిబంధనల ప్రకారం రావాల్సిన మినహాయింపులో 50% వదులుకోవచ్చు. 'Forgo Full Concession' ఎంచుకుంటే మొత్తం మినహాయింపు వదులుకున్నట్టే. అందుకే ఈ ఆప్షన్ ఎంచుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి.Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు


ఇవి కూడా చదవండి:

ఎల్ఐసీ నుంచి మీకు రావాల్సిన డబ్బులు బ్లాక్ అయ్యాయా? కారణాలు ఇవే...

Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి
First published: February 18, 2019, 11:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading