హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Child Ticket Booking: ఐదేళ్ల లోపు పిల్లలకు రైలు టికెట్లు బుక్ చేయండిలా

IRCTC Child Ticket Booking: ఐదేళ్ల లోపు పిల్లలకు రైలు టికెట్లు బుక్ చేయండిలా

IRCTC Child Ticket Booking: ఐదేళ్ల లోపు పిల్లలకు రైలు టికెట్లు బుక్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Child Ticket Booking: ఐదేళ్ల లోపు పిల్లలకు రైలు టికెట్లు బుక్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Child Ticket Booking | పిల్లలతో రైలు ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? పిల్లలకు కూడా రైలు టికెట్ బుకింగ్ రూల్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? 5 ఏళ్ల లోపు పిల్లలకు, 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు వారికి, 12 ఏళ్లు దాటినవారికి వేర్వేరు రూల్స్ ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పిల్లలతో రైలు ప్రయాణం చేసేవారిలో అనేక సందేహాలు ఉంటాయి. ఏ వయస్సు లోపు ఉన్నవారికి రైలు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు? ఫుల్ టికెట్ తీసుకోవాలా? అసలు పిల్లలకు ఐఆర్‌సీటీసీ రైలు టికెట్ బుకింగ్ రూల్స్ (Child Ticket Booking Rules) ఎలా ఉంటాయి? అన్న విషయాలపై రైల్వే ప్రయాణికులకు పూర్తి అవగాహన ఉండదు. దీంతో రైలులో ప్రయాణించేప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు. భారతీయ రైల్వే (Indian Railways) పిల్లలకు రైలు టికెట్ల బుకింగ్ విషయంలో పలు నియమనిబంధనల్ని రూపొందించింది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయి? ఈసారి పిల్లలతో రైలు ప్రయాణం చేసేప్పుడు మీరేం గుర్తుంచుకోవాలో తెలుసుకోండి.భారతీయ రైల్వే నియమనిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లలకు రిజర్వేషన్ అవసరం లేదు. ఐదేళ్ల లోపు పిల్లలకు టికెట్ లేకుండా రైలులో ప్రయాణించవచ్చు. రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ రైళ్లకు ఇదే రూల్ వర్తిస్తుంది. ఒకవేళ పిల్లలకు కూడా ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ అడల్ట్ ఫేర్ అంటే పూర్తి ఛార్జీ చెల్లించి బెర్త్ రిజర్వేషన్ చేయించుకోవాలి. లేదా ఆ రైలులో ఇన్ఫాంట్ సీట్స్ ఉంటే ఆ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీనికి ఛార్జీ ఏమీ ఉండదు. ఇటీవల ఇన్ఫాంట్ బెర్త్ ఆప్షన్ ఒకట్రెండు రైళ్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీన్నే బేబీ బెర్త్ అని పిలుస్తున్నారు. త్వరలో అన్ని రైళ్లల్లో కూడా పసిపిల్లల కోసం బెర్త్ అందుబాటులోకి రానుంది.
Rs 1 Crore Returns: కోటి రూపాయలతో రిటైర్ అవడానికి పొదుపు చేయండిలా
ఒకవేళ ఐదేళ్ల లోపు పిల్లలకు బెర్త్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం పూర్తి ఛార్జీ చెల్లించాలి. ఒకవేళ పిల్లలు వికలాంగులు అయితే దివ్యాంగుల కోటాలో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు రిజర్వేషన్ సమయంలో బెర్త్ కోరుకుంటే పూర్తి ఫేర్ చెల్లించాలి. బెర్త్ వద్దనుకుంటే సగం ఫేర్ చెల్లించాలి. రిజర్వ్‌డ్ సిట్టింగ్ అకామడేషన్‌లో మాత్రం పూర్తి ఫేర్ వర్తిస్తుంది. CC, EC, 2S, EA లాంటి క్లాసుల్లో బెర్త్ వద్దని నిరాకరించే ఆప్షన్ ఉండదు. అన్‌రిజర్వ్‌డ్ రైళ్లల్లో 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు సగం ఛార్జీ వర్తిస్తుంది. ఇక 12 ఏళ్లు దాటిన పిల్లలకు అన్ని రైళ్లల్లో పూర్తి ఛార్జీ వర్తిస్తుంది. మరి రైలు టికెట్లు బుక్ చేసేప్పుడు పిల్లలకు ఏ ఆప్షన్ ఎంచుకోవాలో తెలుసుకోండి.
Aadhaar Card: ఆధార్‌లో ఈ 4 వివరాలు మీరే ఆన్‌‍లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చు


Step 1- ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఓపెన్ చేయండి.
Step 2- మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి.
Step 3- రైలు పేరు సెర్చ్ చేయాలి.
Step 4- ఆ తర్వాత రైలు సెలెక్ట్ చేసుకోవాలి.
Step 5- ఆ తర్వాత Passenger Details పైన క్లిక్ చేయాలి.
Step 6- పసిపిల్లల ఉంటే Add Infant పైన క్లిక్ చేసి వివరాలు యాడ్ చేయాలి.
Step 7- 5 ఏళ్ల లోపు పిల్లలకు బెర్త్ కావాలనుకుంటే Allot Berth పైన క్లిక్ చేసి పూర్తి ఛార్జీ చెల్లించాలి.
Step 8- 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు బెర్త్ కావాలనుకుంటే Allot Berth పైన క్లిక్ చేసి పూర్తి ఛార్జీ చెల్లించాలి.
Step 9- 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు బెర్త్ వద్దనుకుంటే Allot Berth ఆప్షన్‌కు ఉన్న టిక్ తీసేసి సగం ఛార్జీ చెల్లించాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Indian Railways, IRCTC, Train tickets