IRCTC వెబ్‌సైట్ మారింది... కొత్త ఫీచర్లు ఇవే

కొత్త ఫీచర్లతో IRCTC వెబ్‌సైట్ కనిపిస్తోంది. ఇప్పుడు ట్రెయిన్ టికెట్ల బుకింగ్ మరింత సులభతరమైంది. సరికొత్త irctc.co.in లో ఫీచర్లు ప్రయాణికుల్ని ఆకట్టుకుంటున్నాయి. 'ఆస్క్ దిశ' పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ కొత్తగా ప్రవేశపెట్టారు. ప్రయాణికులు రైల్వేకు సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: December 28, 2018, 3:30 PM IST
IRCTC వెబ్‌సైట్ మారింది... కొత్త ఫీచర్లు ఇవే
ఈ యూజర్లు ఇక IRCTC ఉపయోగించుకోలేరు... ఎందుకో తెలుసా?
  • Share this:
IRCTC వెబ్‌సైట్‌ను మార్చేసింది రైల్వే. చాలాకాలంగా వస్తున్న ఫిర్యాదులు, సలహాలు, సూచనల మేరకు వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. కొత్త ఫీచర్లతో IRCTC వెబ్‌సైట్ కనిపిస్తోంది. ఇప్పుడు ట్రెయిన్ టికెట్ల బుకింగ్ మరింత సులభతరమైంది. సరికొత్త irctc.co.in లో ఫీచర్లు ప్రయాణికుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ సరికొత్త ఫీచర్లేంటీ? మీకు ఎంతవరకు ఉపయోగపడ్తాయి? తెలుసుకోండి.

1. కొత్తగా తీర్చిదిద్దిన IRCTC వెబ్‌సైట్‌లో యూజర్లు లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండానే రైళ్లు, సీట్ల లభ్యత వివరాలు తెలుసుకోవచ్చు.

2. వెబ్‌సైట్‌లో ఫాంట్ సైజ్‌ని యూజర్లు తమకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.
3. రైలు బయలుదేరే సమయం, వచ్చే సమయం, క్లాస్, ట్రెయిన్, కోటా లాంటి కొత్త ఫిల్టర్లతో ప్రయాణికులు తమ అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
4. 'వెయిట్‌లిస్ట్ ప్రెడిక్షన్' పేరుతో మరో కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఈ ఆప్షన్‌తో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ లేదా ఆర్ఏసీ టికెట్ కన్‌ఫామ్ అవుతుందో లేదో అంచనా వేయొచ్చు.
5. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల కోసం 'వికల్ప్' పేరుతో మరో కొత్త ఫీచర్‌ యాడ్ చేశారు. దీని ద్వారా ప్రత్యామ్నాయ రైళ్లను ఎంచుకునే వీలుంటుంది.
6. క్విక్ బుకింగ్ కోసం ప్రయాణికుల కోసం 'సెపరేట్ కార్డ్' పేరుతో మరో ఫీచర్ ఉంది. దీని ద్వారా టికెట్ బుకింగ్ సమయం తగ్గుతుంది.7. డిజిటైజేషన్, పేపర్‌లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం చాలావరకు పేమెంట్ ఆప్షన్స్ యాడ్ చేశారు. యూజర్లు ఆరు బ్యాంకుల వివరాలను సేవ్ చేసుకోవచ్చు.
8. 'మై ట్రాన్సాక్షన్స్' విభాగంలో బుకింగ్ డేట్, జర్నీ డేట్, కంప్లీటెడ్ జర్నీ, అప్‌కమింగ్ జర్నీ అని వేర్వేరు ఫిల్టర్లు ఉంటాయి.
9. మీరు బుక్ చేసిన టికెట్ల క్యాన్సలేషన్, ప్రింటింగ్, రిక్వెస్ట్ ఫర్ ఎస్ఎంఎస్, ప్రత్యామ్నాయ రైలుని ఎంచుకోవడం, బోర్డింగ్ పాయింట్ మార్చుకోవడం లాంటివన్నీ ఇక సులభమే.
10. 'ఆస్క్ దిశ' పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ కొత్తగా ప్రవేశపెట్టారు. ప్రయాణికులు రైల్వేకు సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

#Jobs: ప్రైవేట్ సంస్థల్లో 650 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

న్యూ ఇయర్ పార్టీకి బదులు ఈ 10 పనులు చేయండి

బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ని ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి

Good News: డీటీహెచ్ ఛార్జీలు ఇక రూ.500లోపే... ట్రాయ్ కొత్త ఆదేశం

మ్యూచువల్ ఫండ్ తీసుకుంటున్నారా? ఈ 5 అంశాలు పరిశీలించండి
Published by: Santhosh Kumar S
First published: December 28, 2018, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading