IRCTC: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్... కదిలే రైలులో బర్త్‌డే పార్టీ

IRCTC: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్... కదిలే రైలులో బర్త్‌డే పార్టీ

IRCTC | రైల్వే ప్రయాణికులు కదులుతున్న రైలులోనే బర్త్ డే పార్టీ (Birthday Party on Train) సెలబ్రేట్ చేసుకోవచ్చు. రైల్వే సిబ్బంది దగ్గరుండి మరీ బర్త్ డే కేక్ కట్ చేయిస్తారు. ఈ బంపర్ ఆఫర్ ఒక రైలులో మాత్రమే.

  • Share this:
    భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కదిలే రైలులోనే బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఐఆర్‌సీటీసీ కొద్ది రోజుల క్రితం తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (Tejas Express Trains) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. లక్కీ డ్రా నిర్వహించి ప్రయాణికులకు బహుమతులు కూడా అందజేస్తోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మాత్రమే ఈ ఆఫర్ ఉంది. ఈ రైళ్లలో రైలు టికెట్లు బుక్ చేసే ప్రయాణికులకు కొన్ని రోజులుగా లక్కీ డ్రా నిర్వహిస్తోంది. రోజూ రైళ్లలోనే బహుమతుల్ని అందజేస్తోంది. బహుమతి పైన ప్రయాణికుల పేర్లు కూడా ఉంటాయి.


    లక్కీ డ్రా స్కీమ్ ఆగస్ట్ 27న మొదలైంది. సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుంది. లక్నో-ఢిల్లీ రూట్‌లో ప్రయాణిస్తున్న ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చైర్ కార్ కోచ్‌లో 10 మంది ప్రయాణికులకు, ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌లో ముగ్గురికి ఈ బహుమతుల్ని ఇస్తోంది ఐఆర్‌సీటీసీ. లక్కీ డ్రాలో గెలిచినవారికి బహుమతుల్ని ఇవ్వడం మాత్రమే కాదు... తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల బర్త్ డే వేడుకల్ని కూడా సెలబ్రేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ.

    Train Ticket Cancellation: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే నష్టపోతారు

    తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లే ప్రయాణికుల్లో ఆరోజు ఎవరి పుట్టిన రోజు ఉందో వివరాలు సేకరిస్తుంది ఐఆర్‌సీటీసీ. ప్రయాణికుల ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లో ఉన్న వివరాల ఆధారంగా డేట్ ఆఫ్ బర్త్ గుర్తిస్తుంది. బర్త్ డే రోజు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నవారి పుట్టినరోజు వేడుకల్ని కదిలే రైలులోనే నిర్వహిస్తారు తేజస్ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది. ఒకవేళ ఐఆర్‌సీటీసీకి ప్రయాణికుల బర్త్ డే ఎప్పుడో తెలియకపోతే ప్రయాణికులే తేజస్ ఎక్స్‌ప్రెస్ సిబ్బందికి సమాచారం ఇవ్వొచ్చు. ఆ తర్వాత బర్త్ డే పార్టీ రైలులోనే సెలబ్రేట్ చేసుకోవచ్చు.

    IRCTC Ticket Booking: రైలు ప్రయాణికులకు అలర్ట్... టికెట్ బుక్ చేయాలంటే ఈ వివరాలు ఇవ్వాల్సిందే

    కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవలు గతేడాది నిలిచిపోయాయి. 2021 ఆగస్ట్ 6న మళ్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవలు మొదలయ్యాయి. భారతీయ రైల్వే ప్రైవేట్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ మాత్రమే ప్రైవేట్ రైళ్లను నడుపుతోంది. న్యూ ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై రూట్లలో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి.

    తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక ఏర్పాట్లు, హంగులు ప్రయాణికులకు లగ్జరీ ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ఈ రైల్లోనే టీ, కాఫీ, స్నాక్స్, భోజనం అందించేందుకు క్యాంటీన్ ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, ఆటోమెటిక్ డోర్స్‌తో హైటెక్ హంగులు కనిపిస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published: