గతంలో రైలు టికెట్ బుక్ చేయాలంటే క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్నచోటి నుంచే రైలు టికెట్లు (Train Tickets) బుక్ చేయొచ్చు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటైన తర్వాత ఆన్లైన్లో రైలు టికెట్ బుక్ చేసే సదుపాయం వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో రైలు టికెట్లు బుక్ చేస్తుండటంతో రైల్వే కౌంటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయింది. టికెట్ బుకింగ్ మాత్రమే కాదు... ఐఆర్సీటీసీ ఇతర సేవల్ని కూడా అందిస్తోంది. రైలు టికెట్ బుక్ చేసిన తర్వాత క్యాన్సలేషన్ కూడా ఆన్లైన్లోనే చేయొచ్చు. బోర్డింగ్ స్టేషన్ కూడా మార్చొచ్చు. అంటే మీరు రైలు ఎక్కాలనుకున్న స్టేషన్లో కూడా ఆన్లైన్లో మార్పులు చేయొచ్చు.
ఉదాహరణకు ఓ ప్రయాణికుడు కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లేందుకు రైలు టికెట్ బుక్ చేశాడని అనుకుందాం. ఈ రైలు శంషాబాద్ మీదుగా తిరుపతి వెళ్తుంది. ఆ ప్రయాణికుడు తన బోర్డింగ్ స్టేషన్‌ను శంషాబాద్‌కు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. శంషాబాద్ మాత్రమే కాదు... ఆ దారిలో ఏ స్టేషన్లో అయినా రైలు ఎక్కడానికి బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. శంషాబాద్‌కు బోర్డింగ్ స్టేషన్ మార్చుకున్న తర్వాత మళ్లీ కాచిగూడలో రైలు ఎక్కకూడదు. అయితే తప్పనిసరిగా సదరు ప్రయాణికుడు బోర్డింగ్ స్టేషన్ మార్చాల్సి ఉంటుంది. బోర్డింగ్ స్టేషన్ మార్చకుండా రైలు బుకింగ్ చేసిన స్టేషన్లో కాకుండా ఇతర స్టేషన్లో రైలు ఎక్కకూడదు.
IRCTC Tour: టూరిస్టులకు గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి 'టెంపుల్ రన్' ప్యాకేజీ
ఇప్పుడు బోర్డింగ్ స్టేషన్‌ను రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు కూడా మార్చుకోవచ్చు. అంటే రేపు రాత్రి 7.30 గంటలకు రైలు బయల్దేరుతుంది అనుకుంటే ఈ రోజు రాత్రి 7.30 గంటలలోపు ఆన్లైన్లో బోర్డింగ్ స్టేషన్ మార్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణికులు స్వయంగా ఐఆర్సీటీసీ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో బుక్ చేసిన టికెట్లకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. ట్రావెల్ ఏజెంట్ల దగ్గర బుక్ చేసే టికెట్లకు ఇది వర్తించదు. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం బోర్డింగ్ స్టేషన్‌ను ఒకేసారి మార్చుకునే వీలు ఉంటుంది. బోర్డింగ్ స్టేషన్ మార్చిన తర్వాత అదే స్టేషన్లో రైలు ఎక్కాలి. ఒకవేళ బోర్డింగ్ స్టేషన్లో కాకుండా ఇతర స్టేషన్లో రైలు ఎక్కితే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.
IRCTC Shirdi Tour: తిరుపతి నుంచి షిరిడీకి ఐఆర్సీటీసీ టూర్... ప్యాకేజీ వివరాలివే
ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
మీ ఐఆర్సీటీసీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ కావాలి.
లాగిన్ అయిన తర్వాత Booking Ticket History ఆప్షన్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Change Boarding Point పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీరు ఏ స్టేషన్లో రైలు ఎక్కాలని అనుకుంటున్నారో ఆ స్టేషన్ సెలెక్ట్ చేయాలి.
వివరాలు సరిచూసుకొని కన్ఫామ్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, IRCTC, Railways, Special Trains, Train, Train tickets, Travel