IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి 3 సౌతిండియా టూర్ ప్యాకేజీలు

IRCTC South India Tour Packages | ప్యాకేజీ ధరలు ఒకరికి రూ.9,540 నుంచి రూ.15,090 మధ్య ఉన్నాయి. మీరు ఎంచుకునే టూర్ ప్యాకేజీని బట్టి ధర మారుతుంది.

news18-telugu
Updated: June 8, 2019, 5:43 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి 3 సౌతిండియా టూర్ ప్యాకేజీలు
IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి 3 సౌతిండియా టూర్ ప్యాకేజీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC రూ.20,000 లోపు సౌతిండియా టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. సదరన్ మార్వెల్, దక్షిణ్ భారత్ యాత్ర, చెన్నై-కన్యాకుమారి-రామేశ్వరం-మధురై టూర్ పేర్లతో మూడు ప్యాకేజీలను రూపొందించింది ఐఆర్‌సీటీసీ. తక్కువ బడ్జెట్‌లో దక్షిణ భారతదేశ యాత్ర చేయాలనుకునేవారికి ఈ ప్యాకేజీలు ఉపయోగపడ్తాయి. ప్యాకేజీ ధరలు ఒకరికి రూ.9,540 నుంచి రూ.15,090 మధ్య ఉన్నాయి. మీరు ఎంచుకునే టూర్ ప్యాకేజీని బట్టి ధర మారుతుంది. మరి ఏ ప్యాకేజీలో ఏఏ ప్రాంతాలు చూడొచ్చో తెలుసుకోండి.

1. సదరన్ మార్వెల్ టూర్


సదరన్ మార్వెల్ టూర్ 6 రాత్రులు 7 పగళ్లు ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని ముంబై, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి ప్రాంతాలను కవర్ చేస్తుంది ఈ ప్యాకేజీ. శుక్రవారం ముంబై నుంచి టూర్ మొదలవుతుంది. ప్యాకేజీ ధర ఒకరికి రూ.15,090 నుంచి ప్రారంభమవుతుంది.

2. చెన్నై-కన్యాకుమారి-రామేశ్వరం-మధురై టూర్


చెన్నై-కన్యాకుమారి-రామేశ్వరం-మధురై టూర్ 4 రాత్రులు 5 పగళ్లు ఉంటుంది. ప్యాకేజీ ధర ఒకరికి రూ.12,170 నుంచి ప్రారంభమవుతుంది. గ్రూప్ బుకింగ్ చేసుకుంటే ప్యాకేజీ ధర రూ.9,540. కుమారి అమ్మన్ టెంపుల్, త్రివేణి సంగమం, వివేకానంద రాక్ మెమొరియల్, తిరువల్లూర్ స్టాచ్యూ, మహాత్మాగాంధీ మెమొరియల్ మండపం లాంటి ప్రాంతాలను చూడొచ్చు.

3. దక్షిణ్ భారత్ యాత్ర




దక్షిణ్ భారత్ యాత్ర టూర్ 13 రాత్రులు 14 పగళ్లు ఉంటుంది. దక్షిణాదిలోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాలైన రామేశ్వరం, మధురై, కోవలం, త్రివేండ్రం, కన్యాకుమారి, తిరుచ్చిపల్లి, తిరుపతి, మల్లికార్జున ప్రాంతాలు చూడొచ్చు. ప్యాకేజీ ధర రూ.12,285.Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

IRCTC: గోవాలో బస్ ట్రిప్... జస్ట్ రూ.400 మాత్రమే

IRCTC: ఐఆర్‌సీటీసీ టీడీఆర్... ప్రయాణికులు తెలుసుకోవాల్సిన అంశాలివే

IRCTC: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
First published: June 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>