ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC మరో వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ ప్రకటించింది. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్, దువార్స్, ఒడిశాలోని పూరీ, కేరళలోని మున్నార్, వాయనాడ్, అలెప్పీ, తెక్కడి, కుమారకోమ్, కొచ్చిన్, కోవలం లాంటి ప్రాంతాల్లో ఐఆర్సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీలు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా ఒడిశాలోని కోణార్క్‌లో కూడా ఇలాంటి ప్యాకేజీ ప్రకటించింది. 'వర్క్ ఫ్రమ్ హోటల్ విత్ నేచర్' పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.12,600. ఇది డబుల్ ఆక్యుపెన్సీ ధర. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.20,995 చెల్లించాలి. ఇది 3 రోజుల ప్యాకేజీ ధర. 5 రాత్రులు, 7 రాత్రులు, 10 రాత్రులు, 12 రాత్రులు, 15 రాత్రులకు ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉన్నాయి.
ఐఆర్సీటీసీ 'వర్క్ ఫ్రమ్ హోటల్ విత్ నేచర్' ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి కోణార్క్‌లోని లోటస్ రిసార్ట్‌లో బస లభిస్తుంది. కోణార్క్ చేరుకున్న తర్వాత ప్యాకేజీ మొదలవుతుంది. అంటే ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు సొంత ఖర్చులతో అక్కడి వరకు వెళ్లాలి. ఎలాంటి రవాణా సదుపాయం ఉండదు. రిసార్ట్‌కు చేరుకున్న తర్వాత వెల్కమ్ డ్రింక్ ఉంటుంది. ఎన్ని రోజుల ప్యాకేజీ బుక్ చేసుకుంటే అన్ని రోజులు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి. రోజూ రెండు సార్లు టీ లేదా కాఫీ ఇస్తారు. కాంప్లిమెంటరీ వైఫై సదుపాయం ఉంటుంది. డిస్ఇన్ఫెక్టెడ్ రూమ్స్ ఇస్తారు. పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది.
ఐఆర్సీటీసీ 'వర్క్ ఫ్రమ్ హోటల్ విత్ నేచర్' ప్యాకేజీ జూన్ 5 నుంచి ఆగస్ట్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఐఆర్సీటీసీ అందిస్తున్న వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీల వివరాలు ఇదే వెబ్సైట్లో ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.