IRCTC Araku Tour: అద్దాల రైలులో 'ఆంధ్రా ఊటీ' టూర్... ఐఆర్‌సీటీసీ అరకు ప్యాకేజీ వివరాలివే

IRCTC Visakhapatnam-Araku Rail cum Road tour package | ఉదయం విశాఖపట్నంలో బయల్దేరితే అరకు వ్యాలీ, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా గుహలు చూసుకొని తిరిగి సాయంత్రానికి విశాఖపట్నానికి చేరుకుంటారు టూరిస్టులు.

news18-telugu
Updated: November 15, 2019, 1:30 PM IST
IRCTC Araku Tour: అద్దాల రైలులో 'ఆంధ్రా ఊటీ' టూర్... ఐఆర్‌సీటీసీ అరకు ప్యాకేజీ వివరాలివే
IRCTC Araku Tour: అద్దాల రైలులో 'ఆంధ్రా ఊటీ' టూర్... ఐఆర్‌సీటీసీ అరకు ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
విశాఖపట్నం నుంచి అరకుకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ టూర్ చాలా పాపులర్. అయితే కొంతకాలం క్రితం ఈ ప్యాకేజీని ఆపేయడం టూరిస్టులను నిరాశకు గురిచేసింది. కానీ... ఇటీవల విశాఖపట్నం-అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీని మళ్లీ ప్రకటించింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. డిసెంబర్ 11 నుంచి ప్రతీ రోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం ఒక రోజు ప్యాకేజీ మాత్రమే. అంటే ఉదయం విశాఖపట్నంలో బయల్దేరితే అరకు వ్యాలీ, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా గుహలు చూసుకొని తిరిగి సాయంత్రానికి విశాఖపట్నానికి చేరుకుంటారు టూరిస్టులు. ప్యాకేజీలో విశాఖపట్నం నుంచి అరకుకు రైలు ప్రయాణం, నాన్ ఏసీ వాహనంలో అరకు సైట్ సీయింగ్, అరకు నుంచి విశాఖపట్నానికి రిటర్న్ జర్నీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, టీ, బొర్రా గుహలకు ఎంట్రీ ఫీజు కవర్ అవుతాయి.

IRCTC Visakhapatnam-Araku package: ఐఆర్‌సీటీసీ విశాఖపట్నం-అరకు టూర్ వివరాలివే...



ఐఆర్‌సీటీసీ విశాఖపట్నం-అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ బుక్ చేసుకున్న టూరిస్టులు ఉదయం 6:50 నిమిషాలకు విశాఖపట్నంలో 58501 నెంబర్ గల రైలు ఎక్కాలి. ఉదయం 10:50 గంటలకు అరకు చేరుకుంటారు. అక్కడ్నుంచి వాహనంలో మొదట ట్రైబల్ మ్యూజియంకు తీసుకెళ్తారు. గార్డెన్స్‌ని సందర్శించొచ్చు. అక్కడ్నుంచి వైజాగ్‌కు రోడ్డు మార్గంలో బయల్దేరాలి. దారిలో అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా గుహలను సందర్శించొచ్చు. రాత్రికి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ దగ్గర టూర్ ముగుస్తుంది.

IRCTC Visakhapatnam-Araku package: ఐఆర్‌సీటీసీ విశాఖపట్నం-అరకు ప్యాకేజీ ధరలివే...


ఐఆర్‌సీటీసీ విశాఖపట్నం-అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ ప్రారంభ ధర పిల్లలకు రూ.1337, పెద్దలకు రూ.1589. ఇవి 2S క్లాస్ టికెట్ ధరలు. స్లీపర్ క్లాస్ అయితే పిల్లలకు రూ.1412, పెద్దలకు రూ.1664. ఒకవేళ అద్దాల బోగీలో అరకు వెళ్లాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ చెల్లించాలి. ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌లో పిల్లలకు రూ.2215, పెద్దలకు రూ.2467 ఛార్జీ ఉంటుంది. ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌లో 4, స్లీపర్ క్లాస్‌లో 3 సీట్లు మాత్రమే ఉంటాయి. 2S క్లాస్‌లో 10 సీట్లు ఉంటాయి. ఈ టూర్ డిసెంబర్ 11 నుంచి ప్రతీ రోజు ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్నవాళ్లు ఒకవేళ టూర్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. క్యాన్సలేషన్ ఛార్జీలతో పాటు ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?

ఇవి కూడా చదవండి:

IRCTC: బ్యాంకాక్‌లో న్యూ ఇయర్ పార్టీ... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

IRCTC Tirupathi Tour: తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... విశేషాలివే

IRCTC: గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర
Published by: Santhosh Kumar S
First published: November 15, 2019, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading