హోమ్ /వార్తలు /business /

IRCTC Tour: రాజమండ్రి నుంచి 9 రోజులు ఉత్తర భారతదేశ యాత్ర... ప్యాకేజీ ధర రూ.9,000 లోపే

IRCTC Tour: రాజమండ్రి నుంచి 9 రోజులు ఉత్తర భారతదేశ యాత్ర... ప్యాకేజీ ధర రూ.9,000 లోపే

IRCTC Uttar Bharat Darshan tour | ఉత్తరభారతదేశ యాత్రకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర భారతదేశ యాత్ర ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

    ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్ (Bharat Darshan Tourist Train) ద్వారా పర్యాటకుల్ని దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్తోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి 'ఉత్తర భారత్ దర్శన్ విత్ మాతా వైష్ణో దేవి' టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. 2022 మార్చి 19న టూర్ ప్రారంభం అవుతుంది. మార్చి 27న టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో ఆగ్రా, మథుర, మాతా వైష్ణోదేవి, అమృత్‌సర్, హరిద్వార్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

    IRCTC Uttar Bharat Darshan tour: ఉత్తర భారత్ దర్శన్ టూర్ వివరాలు ఇవే

    పర్యాటకులు మొదటి రోజున రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాసలో భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు ఆగ్రా చేరుకుంటారు. రాత్రి ఆగ్రాలోనే బస చేయాలి. మూడో రోజు ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మథుర బయల్దేరాలి. అక్కడ కృష్ణ జన్మభూమి సందర్శన ఉంటుంది. ఆ తర్వాత శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రాకు బయల్దేరాలి.

    IRCTC Goa Tour: ఏడు వేలకే గోవా టూర్... విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచి ప్యాకేజీ

    నాలుగో రోజు మాతా వైష్ణోదేవి కాట్రాకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి. ఐదో రోజు వైష్ణోదేవి యాత్ర ఉంటుంది. కాలినడకన లేదా పోనీ సర్వీస్ ద్వారా వెళ్లొచ్చు. హెలికాప్టర్ సర్వీస్ కావాలనుకుంటే పర్యాటకులు రెండు నెలలు ముందు సొంత ఖర్చులతో అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాలి. ఆరో రోజు శ్రీ మాతా వైష్ణో దేవి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత అమృత్‌సర్ బయల్దేరాలి. గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్ సందర్శించొచ్చు. ఆ తర్వాత హరిద్వార్ బయల్దేరాలి.

    IRCTC Tirupati Tour: కరీంనగర్, వరంగల్ నుంచి ఐదు వేలకే తిరుపతి టూర్... శ్రీవారి దర్శనం కూడా...

    ఏడో రోజు హరిద్వార్ చేరుకుంటారు. ఆ రోజంతా సైట్ సీయింగ్ ఉంటుంది. మానస దేవి మందిర్ దర్శించుకోవచ్చు. సాయంత్రం గంగా హారతికి హాజరు కావొచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఎనిమిదో రోజంతా ప్రయాణం ఉంటుంది. తొమ్మిదో రోజు ప్రయాణికులు పలాస, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

    ఐఆర్‌సీటీసీ ఉత్తర భారత్ దర్శన్ టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.8510 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.10,400. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ లాంటివి కవర్ అవుతాయి.

    First published:

    ఉత్తమ కథలు