తక్కువ ధరకే గోవా, హంపి, మైసూర్ టూర్ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం. 'స్ప్లెండర్స్ ఆఫ్ కర్నాటక విత్ స్ప్లాషీ గోవా' పేరుతో ప్యాకేజీ అందిస్తోంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. 2021 జూన్ 1న టూర్ ప్రారంభమై జూన్ 7న ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.6,620. ఇది స్టాండర్డ్ ప్యాకేజీ ధర. కంఫర్ట్ ప్యాకేజీ ఎంచుకుంటే రూ.11,030 చెల్లించాలి. పిలిగ్రిమేజ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఈ టూర్ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ టూర్ మొదలవుతుంది. దువ్వాడలో టూరిస్ట్ రైలు బయల్దేరుతుంది. దారిలో టూరిస్టులు రాజమండ్రి, సామర్లకోట, ఏలూరు, విజయవాడ జంక్షన్, నల్గొండ, సికింద్రాబాద్, కర్నూలు టౌన్, గుంతకల్లు స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులు గోవా, హంపి, మైసూర్ లాంటి టూరిస్ట్ ప్రాంతాలు చూడొచ్చు.
స్టాండర్డ్ టూర్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ జర్నీ ఉంటుంది. వీటితో పాటు బస ఏర్పాట్లు, టీ, కాఫీ, శాకాహార భోజనం, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
IRCTC Splendours of Karnataka with Splashy Goa: ఐఆర్సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే
Day 1: మొదటి రోజు అర్ధరాత్రి 12.05 గంటలకు దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు బయల్దేరుతుంది. మొదటి రోజు ప్రయాణికులు రాజమండ్రి, సామర్లకోట, ఏలూరు, విజయవాడ జంక్షన్, నల్గొండ, సికింద్రాబాద్, కర్నూలు టౌన్, గుంతకల్లు స్టేషన్లలో ఈ రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రికి హోస్పేట్ చేరుకుంటారు. అక్కడ్నుంచి హంపికి తీసుకెళ్తారు. రాత్రి హంపిలోనే బస చేయాలి.
Day 2: రెండో రోజు హంపిలోని పర్యాటక ప్రాంతాలన్నీ చూడొచ్చు. శ్రీ విరూపాక్ష ఆలయాన్ని సందర్శించొచ్చు. రాత్రికి హోస్పేట్ నుంచి బయల్దేరాలి.
Day 3: మూడో రోజు ఉదయం మడగావ్ చేరుకుంటారు. అక్కడే బస చేయాలి. ఆరోజు నార్త్ గోవా సందర్శన ఉంటుంది. ఫోర్ట్ అగ్వాడా, క్యాండోలిమ్ బీచ్, ఇతర బీచ్‌లు చూడొచ్చు. సాయంత్రం మండోవీ రివర్‌పై క్రూజ్ ప్రయాణం ఉంటుంది. సొంత ఖర్చులతో క్రూజ్ ప్రయాణం చేయాలి.
Day 4: నాలుగో రోజు సౌత్ గోవా టూర్ ఉంటుంది. చర్చ్ బసిలికా ఆఫ్ బామ్ జీసస్, శ్రీ మంగ్వేష్ ఆలయం, శ్రీ శాంతదుర్గ ఆలయం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మడగావ్ నుంచి బయల్దేరాలి.
Day 5: ఐదోరోజు ఉదయం మైసూరు చేరుకుంటారు. ఆ రోజంతా మైసూర్ సైట్‌సీయింగ్ ఉంటుంది. మైసూర్ సిటీ ప్యాలెస్, బృందావన్ గార్డెన్, కేఆర్ఎస్ డ్యామ్ సందర్శించొచ్చు. రాత్రికి మైసూరులోనే బస చేయాలి.
Day 6: ఆరో రోజు ఉదయం చాముండీ హిల్స్, సెయింట్ ఫిలోమినస్ చర్చ్, శ్రీరంగపట్నం సందర్శించొచ్చు. సాయంత్రం మైసూరు నుంచి బయల్దేరాలి.
Day 7: ఏడో రోజు టూరిస్ట్ రైలు గుంతకల్లు జంక్షన్, కర్నూలు టౌన్, సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, విజయవాడ జంక్షన్, ఏలూరు, సామర్లకోట, రాజమండ్రి మీదుగా దువ్వాడకు చేరుకుంటుంది. దీంతో టూర్ ముగుస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.