హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC: స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC: స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Saurashtra With Statue of Unity Tour | ఐఆర్‌సీటీసీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోండి.

  స్టాచ్యూ ఆఫ్ యూనిటీ... ఈ మాట వినగానే గుజరాత్ రాష్ట్రంలోని కేవడియాలో ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్ల సర్దార్ వల్లభ్‌బాయి పటేల్ విగ్రహం గుర్తొస్తుంది. మరి మీరు కూడా ఆ స్టాచ్యూని చూడాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. 'సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 2021 మార్చి 6న టూర్ ప్రారంభమవుతుంది. ఫ్లైట్‌లో టూర్ తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.23,300. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.24,200, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,400 చెల్లించాలి. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బస, భోజనం, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  IRCTC Bharat Darshan: 10 రోజుల టూర్‌కు రూ.10 వేలే ఖర్చు... విజయవాడ, వరంగల్ నుంచి భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్

  IRCTC e-catering: ఫిబ్రవరి 1 నుంచి ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్ సర్వీస్ ప్రారంభం... ఫుడ్ ఆర్డర్ చేయండిలా

  IRCTC Saurashtra With Statue of Unity Tour: టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే...


  ఐఆర్‌సీటీసీ 'సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' టూర్ మార్చి 6న ప్రారంభం అవుతుంది. ఉదయం 5.55 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 7.55 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి తీసుకెళ్తారు. రాత్రికి అహ్మదాబాద్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి. మార్చి 7న ఉదయం అహ్మదాబాద్‌లో 7.45 గంటలకు అహ్మదాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే 8.55 గంటలకు పోర్‌బందర్ చేరుకుంటారు. పోర్‌బందర్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకకు తీసుకెళ్తారు. ద్వారక, నాగేశ్వర్ ఆలయం సందర్శించిన తర్వాత రాత్రికి ద్వారకలో బస చేయాలి.

  Railway Helpline Number: అలర్ట్... ఆ రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ పనిచేయదు... కాల్ చేయాల్సిందే కొత్త నెంబర్‌కే

  Indian Railways: రైలు ప్రయాణికుల ప్రైవసీ కోసం ప్రత్యేక కిటికీలు... ఎలా ఉంటాయంటే

  మార్చి 8న ఉదయం ద్వారక నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమ్‌నాథ్‌కు తీసుకెళ్తారు. సోమనాథ ఆలయం సందర్శించిన తర్వాత రాత్రికి సోమనాథ్‌లో బస చేయాలి. మార్చి 9న సోమనాథ్ నుంచి పోర్‌బందర్‌కు బయల్దేరాలి. పోర్‌బందర్‌లో కృతి మందిర్, ఇతర ఆలయాలు సందర్ఛించొచ్చు. రాత్రికి పోర్‌బందర్‌లో బస చేయాలి. మార్చి 10న ఉదయం 9.20 గంటలకు పోర్‌బందర్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 10:20 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. అహ్మదాబాద్‌లో సబర్మతీ ఆశ్రమం, అక్షర్‌ధామ్ ఆలయం సందర్శించొచ్చు. రాత్రి 9.30 గంటలకు అహ్మదాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 11.35 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Best tourist places, Hyderabad, Hyderabad news, Indian Railway, Indian Railways, IRCTC, IRCTC Tourism, Railways, Statue of Unity, Tourism, Train, Train tickets