IRCTC: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి ఐఆర్‌సీటీసీ నేచురోపతి ప్యాకేజీ

IRCTC: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి ఐఆర్‌సీటీసీ నేచురోపతి ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Post Covid Rejuvenation and Detoxification | కోవిడ్ నుంచి కోలుకున్నారా? నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించింది.

  • Share this:
    ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వినూత్నమైన టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. గతంలో పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీలను ప్రకటించేది. వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిన వారికి ఇటీవల వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇప్పుడు హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. కరోనా సోకి కోలుకున్నవారు పూర్తిస్థాయిలో ఆరోగ్యం పొందడం కోసం 'పోస్ట్ కోవిడ్ రిజ్యువెనేషన్ అండ్ డీటాక్సిఫికేషన్' ప్యాకేజీని ప్రకటించింది. కోల్‌కతాలోని నేచర్ క్యూర్ ఆస్పత్రితో కలిసి ఈ ప్యాకేజీ అందిస్తోంది. ఇది ఏడు రోజుల ప్యాకేజీ. ఐఆర్‌సీటీసీ టూరిజం 'పోస్ట్ కోవిడ్ రిజ్యువెనేషన్ అండ్ డీటాక్సిఫికేషన్' ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి కోల్‌కతాలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ఏడు రోజుల పాటు ట్రీట్‌మెంట్స్ ఉంటాయి. యోగా, డైట్, ఎక్సర్‌సైజ్, జిమ్యాజియం, వాకింగ్ ట్రాక్స్ లాంటివి ఉంటాయి. నేచురోపతిలో మడ్ ప్యాక్, ఎనీమా, హిప్ బాత్, ఫుట్‌బాత్, ప్యాక్స్, ఇమర్షన్ బాత్, ఆక్యుపంక్చర్, ఆక్యూప్రెషర్, మసాజ్, స్టీమ్ బాత్ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్రతీ రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోజంతా నేచురోపతి ట్రీట్మెంట్స్, డైట్‌ ఉంటాయి.

    IRCTC Work From Hotel: హిమాలయాలకు దగ్గరగా ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ

    IRCTC Work from Hotel: ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ... ధర రూ.7,710 మాత్రమే


    ఐఆర్‌సీటీసీ టూరిజం 'పోస్ట్ కోవిడ్ రిజ్యువెనేషన్ అండ్ డీటాక్సిఫికేషన్' ప్యాకేజీ ప్రారంభ ధర రూ.23,660. ఇది నాన్ ఏసీ షేరింగ్ ధర. సింగిల్ రూమ్ కావాలంటే రూ.27,120 చెల్లించాలి. ఏసీ డీలక్స్ సింగిల్ రూమ్ ధర రూ.40,115. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.29,290. ఏసీ సూపర్ డీలక్స్ సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.46,920 కాగా డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.31,451. చిన్న కాటేజీ సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.50,510 కాగా డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.33,870. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: