హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Ooty Tour: ఆరు వేలకే ఊటీ హాలిడే ట్రిప్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Ooty Tour: ఆరు వేలకే ఊటీ హాలిడే ట్రిప్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Ooty Tour: ఆరు వేలకే ఊటీ హాలిడే ట్రిప్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Ooty Tour: ఆరు వేలకే ఊటీ హాలిడే ట్రిప్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Ooty Holiday Trip | ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరకే ఊటీ టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

శీతాకాలంలో నీలగిరి అందాలను చూడాలనుకునేవారికి శుభవార్త. ఐఆర్‌సీటీసీ ఊటీ ప్యాకేజీ ప్రకటించింది. 'ఊటీ హాలిడే ట్రిప్' పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. ఊటీలో ఉష్ణోగ్రత ఎప్పుడూ 15 నుంచి 20 డిగ్రీల మధ్య ఉంటుంది. అదే చలికాలమైతే ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోతుంది. వేసవి వేడిని భరించలేనివాళ్లు అందుకే ఊటీ వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక చలి అంటే ఎక్కువగా ఇష్టమున్నవాళ్లు మాత్రం వింటర్‌లో ఊటీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఐఆర్‌సీటీసీ ఊటీ హాలిడే ట్రిప్ ప్యాకేజీని రూ.6,000 లోపే బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర ఒకరికి రూ.5860 మాత్రమే. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.7630. రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ఇది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ఊటీలోని దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్స్, సినిమా షూటింగ్ జరిపే ప్రాంతాలు, పైకారా ఫాల్స్, సిమ్స్ పార్క్, లాంబ్స్ రాక్, ముదుమలై వైల్డ్ లైఫ్ సాంక్చువరీ, డాల్ఫిన్స్ నోస్ లాంటి ప్రాంతాలు చూడొచ్చు. ఈ ప్యాకేజీలో రైలు టికెట్ కవర్ కాదు. రెండు రాత్రులు ఊటీలో అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. కొయంబత్తూర్ నుంచి ఈ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ https://www.irctctourism.com/ ఓపెన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

IRCTC Coorg Tour: కూర్గ్ అందాలు చూడాలనుకుంటున్నారా? టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC: అండమాన్ వెళ్లాలా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

IRCTC Ooty Holiday Trip: ఐఆర్‌సీటీసీ ఊటీ హాలిడే ట్రిప్ వివరాలు ఇవే


Day 01: ఐఆర్‌సీటీసీ ఊటీ హాలిడే ట్రిప్ ప్యాకేజీ కొయంబత్తూర్‌లో మొదలవుతుంది. కాబట్టి పర్యాటకులు మొదటిరోజు ఉదయమే కొయంబత్తూర్ చేరుకోవాలి. పర్యాటకుల్ని కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌లో పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత ఊటీకి రోడ్డు మార్గంలో తీసుకెళ్తారు. ఊటీలోని హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం తీసుకెళ్తారు. ఆ తర్వాత ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్స్ చూడొచ్చు. రాత్రికి ఊటీలోనే బస చేయాలి.

Day 02: రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సినిమా షూటింగ్ జరిపే ప్రాంతాలు, పైకారా ఫాల్స్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ముదుమలై వైల్డ్ లైఫ్ సాంక్చువరీలో విహరించొచ్చు. ముదుమలైలో ఎలిఫెంట్ క్యాంప్, జంగిల్ రైడ్ లాంటివి ఎంజాయ్ చేయొచ్చు. రెండో రోజు రాత్రి కూడా ఊటీలోనే బస చేయాలి.

Day 03: మూడో రోజు ఉదయం ఊటీ నుంచి చెకౌట్ కావాలి. బస్సులో లేదై నీలగిరి ప్యాసింజర్ రైలులో కూనూర్ తీసుకెళ్తారు. కూనూర్ చేరుకున్న తర్వాత సిమ్స్ పార్క్, ల్యాంబ్స్ రాక్, డాల్ఫిన్స్ నోస్ ప్రాంతాలు చూడొచ్చు. ఆ తర్వాత కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ లేదా ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తారు.

First published:

Tags: Best tourist places, Irctc, IRCTC Tourism, Tourism

ఉత్తమ కథలు