దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి టూర్లు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇప్పటికే డివైన్ కర్నాటక (Divine Karnataka) పేరుతో 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ టూరిజం... ఇప్పుడు అదే పేరుతో 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడుపి లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. కాచిగూడలో మంగళవారం టూర్ మొదలైతే ఆదివారం తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక టూర్ మంగళవారం కాచిగూడలో ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 6.05 గంటలకు 12789 నెంబర్ గల రైలు ఎక్కితే ఆరోజంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరు చేరుకుంటారు. ఐఆర్సీటీసీ సిబ్బంది అక్కడ రిసీవ్ చేసుకొని ఉడుపి తీసుకెళ్తారు. అక్కడ సెయింట్ మేరీ ఐల్యండ్, మాల్పే బీచ్ సందర్శించొచ్చు. రాత్రికి ఉడుపిలో బస చేయాలి.
IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
మూడో రోజు ఉదయం శ్రీకృష్ణ ఆలయం సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత శృంగేరి బయల్దేరాలి. శారదాంబ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మంగళూరు బయల్దేరాలి. రాత్రికి మంగళూరులో బస చేయాలి. నాలుగో రోజు ధర్మస్థల బయల్దేరాలి. అక్కడ మంజునాథ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కుక్కి సుబ్రమణ్య బయల్దేరాలి. కుక్కి ఆలయ సందర్శన తర్వాత తిరిగి మంగళూరు బయల్దేరాలి. రాత్రికి మంగళూరులో బస చేయాలి.
ఐదో రోజు మంగళూరు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. పిలికుల నిసర్గధామ, మంగళదేవి ఆలయం, కటీల్ ఆలయం, తన్నీర్బావి బీచ్ సందర్శించొచ్చు. సాయంత్రం 7 గంటలకు మంగళూరు సెంట్రల్లో రైలు ఎక్కితే మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
IRCTC Tour: రాజమండ్రి నుంచి 9 రోజులు ఉత్తర భారతదేశ యాత్ర... ప్యాకేజీ ధర రూ.9,000 లోపే
ఐఆర్సీటీసీ డివైన్ కర్నాటక టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.13,380, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.15,670, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.24,770. ఇక స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10,380, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,620, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.21,770. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఏసీ హోటల్లో బస, బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Karnataka, Tourism, Travel